3
April, 2025

A News 365Times Venture

3
Thursday
April, 2025

A News 365Times Venture

RK Roja: అరెస్టులు చేస్తే చేసుకోండి..! చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై రోజా హాట్‌ కామెంట్స్..

Date:

RK Roja: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్లు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు, లోకేష్ కుటుంబాలను బంగారుమయం చేసుకుంటారేమో.. కానీ, పేద ప్రజలకు చేసేదేమీ లేదన్నారు.. చంద్రబాబు మీటింగులకు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌ ఎక్కడ నిద్రపోతున్నారో అర్ధం కావటం లేదు అని ఎద్దేవా చేశారు. మొన్న వీళ్ల వెకిలి డ్యాన్సులకు పడిపడి నవ్వారు.. తిరుమలలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఈ సనాతన యోధుడు ప్రశ్నించటం లేదు.. తిరుమలలో జరిగిన అన్యాయాలు ప్రశ్నించే బాధ్యత మీకు లేదా..? వక్ఫ్ బిల్లుపై వీరు చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్రంలో ఉన్న ముస్లీంలు మొత్తం చూస్తున్నారు.. అసలు, బీజేపీకి భయపడి పవన్‌ కల్యాణ్‌ ఎక్కడా ఇఫ్తార్ లో కూడా పాల్గొనలేదన్నారు.. వైసీపీలో గట్టిగా మాట్లాడే వారిని టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో భయపెట్టాలని చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో వాళ్ళ నేతలు కూడా చూస్తారు అని హెచ్చరించారు.. ఇంతవరకు ఆడుదాం ఆంధ్రపై కేసులు బుక్ అవ్వలేదు.. అసెంబ్లీలో ఇప్పటికే అన్నీ విషయాలు స్పష్టంగా చెప్పాం.. ఈ వ్యవహారంలో నాకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏం సంబంధం లేదన్నారు. లోపల ఒక మాట, బయట ఒక మాట మాట్లాడుతున్నారు.. అంతా పారదర్శకంగా జరిగింది.. రోజాని అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలనే ఆశ ఉంది.. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబును అరెస్ట్ చేయించాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు రోజా..

Read Also: Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి!

మాజీ మంత్రుల అరెస్టులు, వరుసగా నమోదవుతున్న కేసులపై స్పందించిన రోజా.. వైసీపీలో బలమైన నాయకత్వాన్ని తొక్కడానికి వాళ్ల నోట్లు నొక్కడానికి కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారన్న భయంతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే కేసులు పెట్టండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం అని సవాల్‌ చేశారు.. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదు. నిబంధనల ప్రకారం ఆడుదాం ఆంధ్రా నిర్వహించాం.. శాప్ చైర్మన్ కు, స్పోర్ట్స్ మినిస్టర్ కు ఏమి సంబంధం లేదని స్పష్టం చేవారు. అసెంబ్లీలో, మండలిలో ఆడుదాం ఆంధ్రాలో ఏ అవినీతి జరగలేదని నివేదిక ఇచ్చారు. రోజాను, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నానినీ అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని చూస్తున్నారు.. మేం భయపడబోం అన్నారు..

Read Also: Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!

ఇక, ప్రతీ రోజు 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. అసెంబ్లీలో టీడీపీ వాళ్ళే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.. రాష్ట్రంలో మహిళలపై దురాగతాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఆర్కే రోజా.. ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్.. ముఖ్యమంత్రి కుప్పంలో కానీ.. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ లో గంజాయి పండిస్తున్నారు.. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు.. విద్యార్దులు, మహిళా సంఘాలు పోరాటాల తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి.. ఏజీఎం దీపక్ అనే వ్యక్తి యువతికి నరకం చూపించాడు.. ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.. పాస్టర్ విషయంలో కేసులు డైవర్ట్ చేయాలని కొన్ని సీసీ ఫుటేజ్ లు బయటకు ఇస్తున్నారు.. పోలీసులు టీడీపీ కార్యకర్తలా మారిపోయారు.. రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ అంటున్నారు.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.. రోజుకు 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ముందు అవి పట్టించుకోండి.. దిశా చట్టాన్ని అమలు చేసి మహిళలను కాపాడాలి.. వైసీపీ నేతలపై అక్రమ కేసులు, కిడ్నాపులు చేయిస్తున్నారు.. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో ఓ మహిళా ఎంపీటీసీ బెదిరించి ఓటు వేయించుకోవాలని చూసినా జగనన్న కోసం నిలబడ్డారు.. పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో భర్త ఉద్యోగం తీసేస్తామని బెదిరించిన ఓ ఎంపీటీసీ నిలబడ్డారు.. రెడ్ బుక్ కోసం కాకుండా ఇచ్చిన హామీల అమలుకు పనిచేయాలి.. ఇంకా బెదిరింపులకు పాల్పడతం అంటే కుదరదు.. మీరు ఈవీఎం లను నమ్ముకుంటే చాలనుకుంటున్నారు కాబట్టే ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: అక్కడ టీడీపీ, జనసేన వార్‌ ఓపెనైపోయిందా..? ఆయన వ్యవహారశైలి అగ్గి రాజేసిందా…?

Off The Record: అనకాపల్లి జిల్లా… యలమంచిలి సెగ్మెంట్‌లో కూటమి పాలిటిక్స్...

Hyderabad: పెచ్చులూడిన చార్మినార్.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్ లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. బలమైన ఈదురు గాలులు...

Off The Record: విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారా..? అందుకేనా పొలిటికల్ కామెంట్స్..?

Off The Record: వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్‌ లేకున్నా… నంబర్‌...