11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా

Date:

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP)తో కలిసి వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రేఖా గుప్తా స్పందిస్తూ.. వరుస ఎన్నికల ఓటములను జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు తమ రాజకీయ అసహనాన్ని ఢిల్లీ ప్రజలపై చూపిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ కార్యకలాపాల వల్ల ఉద్యోగాలకు వెళ్లే వారు, రోజువారీ కూలీలు, ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో “ఢిల్లీని బందీగా మార్చనివ్వం” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అశాంతిని సృష్టించే ప్రయత్నాలకు గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.

కుటుంబ రాజకీయాలు, రాజకీయ అవకాశవాదంతో నడిచే పార్టీలు ప్రజల తీర్పును అంగీకరించలేకపోతున్నాయని రేఖా గుప్తా ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొంతమంది నాయకుల రాజకీయ ఆకాంక్షలు.. ఢిల్లీలోని లక్షలాది కుటుంబాల జీవనోపాధి, భద్రత, ప్రశాంతత కంటే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకాన్ని సృష్టించే రాజకీయాలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తుందని రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ తమకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని కూడా ప్రజల మద్దతుకు నిదర్శనంగా ప్రస్తావించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన...

Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..

Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం...

CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!

CJP Protest:  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్...

CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!

CJP Protest:  ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా...