27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

Date:

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించిన మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. “శుభక్షేత్ర” అనే పేరుతో వెంచర్లు వేసి, అధిక లాభాలు ఆశజూపి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు రామావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పటాన్‌చెరు , దామరగిద్ద ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ఈ దందా సాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Priyanka Gandhi: “చాణక్యుడు కూడా ఇలా ప్లాన్ చేయలేడు”.. ప్రియాంకా సెటైర్లపై అమిత్ షా నవ్వులు..

ఈ స్కామ్‌లో హేమకాంత్ రెడ్డి, రామావత్ మధు, సత్యనారాయణ చౌదరి కీలక సూత్రధారులుగా వ్యవహరించారు. వీరు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అత్యంత ఆకర్షణీయమైన హామీలను ఎరగా వేశారు. ఒక ప్లాన్ ప్రకారం, తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారికి 102 చదరపు గజాల ప్లాట్ ఇవ్వడమే కాకుండా, రాబోయే 42 నెలల పాటు నెలకు 25 వేల రూపాయల చొప్పున ఆదాయం అందిస్తామని నమ్మబలికారు. వీటికి అదనంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని మాయమాటలు చెప్పి సుమారు 33 మంది బాధితుల నుంచి భారీగా సొమ్ము సేకరించారు.

Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

అయితే, బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత నిందితుల అసలు స్వరూపం బయటపడింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని కోరగా, కేవలం ఒప్పంద పత్రాలతోనే కాలయాపన చేస్తూ బాధితులను తిప్పించుకోవడం మొదలుపెట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) , తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం (TSPDFEA) కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం రామావత్ మధును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..

Shoaib Akhtar: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజు రోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా మాజీ...

Mohanlal: ‘ఏజ్‌ ఈజ్ జస్ట్‌ నంబర్‌’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!

Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు....

Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..

Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం...

Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..

Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB)...