బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మె్ల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ అంటే జుటా.. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేవుడని పొగిడావు.. అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు.. భయ పడ్డావ అంటూ ఎద్దేవా చేశారు.
Also Read:Minister Seethakka: ఒక నియంత అధికారం పోయిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నటుంది..
అసెంబ్లీలో నేను అడిగినప్పుడు అబద్ధాలే చెప్పావు.. తెలంగాణకు పది లక్షల కోట్లు వచ్చాయి.. తెలంగాణ అభివృద్ధి కేంద్రం వల్లనే జరిగింది.. ప్రజలు మీ రాజ్యం చూశారు.. మీరు తెలంగాణను అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ చేశారు.. యువకులు తాగుడుకు బానిస అవుతున్నారు.. దీనికి కారణం మీరే అని కేసీఆర్ పై మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు..
Also Read:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భారత్ భయం.. అధికారులు, జవాన్‌ల రాజీనామా పర్వం..
దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేరు.. మా నాయకులు కరెక్ట్ ఉంటే మొన్ననే బీజేపీ అధికారం లోకి వచ్చేదని అన్నారు. కొత్త ప్రసిడెంట్ వస్తారు.. ఆ ప్రసిడెంట్ ను తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం.. కెసిఆర్ మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తదనేది మర్చిపోండి.. మీరు ఫార్మ్ హౌస్ కు పోయి పడుకోండి అంటూ రాజా సింగ్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.