కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి రెండు సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేయడమే కాదు.. అటు మలయాళం, ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్ ఫైట్ ఉందనుకుంటే.. ఇప్పుడు వీరికి కాంపిటీటర్ అయింది అండర్‌రేటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. వీరిలా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి రాలేదు కానీ.. నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్.. ఆసా కూడా సాంగ్‌తో మెప్పించింది. కన్నప్పకు కమిట్ అయి ఒక్కసారిగా చర్చకు దారితీసేలా చేసింది అమ్మడు. అంతకు ముందు ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో పలకరించినా.. పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు ప్రీతి పేరు. కానీ కన్నప్పలో సాంగ్ రిలీజ్ కాగానే మేడమ్ నేమ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.
Dear Uma: నటించడం చాలా సులభం… నిర్మాతగా ఉండటం చాలా కష్టం!
కన్నప్పతో హ్యాట్రిక్‌పై కన్నేసింది ఈ బ్యూటీ. అన్నీ సెట్ అయ్యుంటే రిజల్ట్ ఈ నెల 25కే తేలిపోయేది. కానీ వీఎఫ్ఎక్స్ ఇతర కారణాల వల్ల జూన్ 27కు బొమ్మ పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ పాన్ ఇండియా చిత్రమే కాదు.. మేడమ్ చేతిలో మరో మూడు ప్రాజెక్టులున్నాయి. ఇదయం మురళిలో అథర్వతో జోడీ కడుతోంది. ఇందులో కాయత్ లోహార్ మరో హీరోయిన్. ఈ మూవీ కూడా జూన్ లేదా జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైనే ప్యార్ కియా అనే సినిమాతో మాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమైంది ఈ తమిళ పొన్ను.
హరీష్ కల్యాణ్ 15 మూవీకి కమిట్ అయ్యింది ప్రీతి ముకుందన్. లిఫ్ట్ డైరెక్టర్ వినీత్ వరప్రసాద్ దర్శకుడు. స్టార్ మూవీలోనే ఈ ఇద్దరూ కలిసి నటించాల్సి ఉంది. ఫస్ట్ హరీష్ ఈ సినిమాకు కమిట్ కాగా, ఆ ప్లేస్‌లోకి రీప్లేస్ అయ్యాడు కవిన్. అలా మంచి హిట్ మిస్ చేసుకున్నాడు హరీష్. తెలుగు జెర్సీ మూవీలో నాని కొడుకుగా చివరిలో మెరిసిన హరీష్.. తమిళంలో పార్కింగ్, లవ్వర్ పందుతో ఫ్రూవ్ చేసుకున్నాడు. స్టార్ మూవీ టైంలో మిస్సైన జోడీ.. ఇప్పటికి సెట్ అయ్యింది. ప్రస్తుతం సైలెంట్ హిట్స్ ఇచ్చి.. మెల్లిగా దూసుకెళ్తున్న ప్రీతి ముకుందన్.. ఇక హ్యాట్రిక్ హిట్ కొడితే.. మరిన్ని ఛాన్సులు కొల్లగొట్టి.. ఈ ఇద్దరు భామలకు మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చేట్లే కనిపిస్తోంది.