9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..

Date:

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా జరుగుతున్న పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పెంచుతూ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జూలై 29న విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్ల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో 275 సివిల్ ఎస్సై, 23 ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో), 7,112 సివిల్ కానిస్టేబుల్, 27 కానిస్టేబుల్ (మెకానిక్/డ్రైవర్) పోస్టులు ఉన్నాయి.

ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవ్వగా, అభ్యర్థుల సౌకర్యార్థం ఆఖరి తేదీని సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 3.38 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. వారిలో నాలుగో వంతు (25%) మహిళా అభ్యర్థులే ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక చాలామంది వెబ్‌సైట్‌లో పేరు నమోదు (రైజింగ్/రిజిస్ట్రేషన్) చేసుకున్నారు. వారిలో 2,88,530 మంది అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించారు. ఫీజు చెల్లించిన వారందరిలో 2,76,085 మంది అభ్యర్థులు తమ పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను వెబ్‌సైట్‌లో విజయవంతంగా సబ్‌మిట్ చేశారు.

ఈ సారి నియామక ప్రక్రియలో తొలిసారిగా ఆధార్ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టగా.. ఇప్పటికే 95 శాతానికి పైగా అభ్యర్థుల పరిశీలన పూర్తయింది. అలాగే ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్ శాఖల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు గ్రూప్-1, 2, 3 వర్గీకరణ రిజర్వేషన్లను తొలిసారిగా అమలు చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల వేతనాల (హౌస్ రెంట్ అలవెన్స్ – HRAతో కలిపి) వివరాలు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. దాని ప్రకారం.. సబ్ ఇన్ స్పెక్టర్ (పోలీస్ / SPF) పోస్టులకు ప్రారంభ వార్షిక వేతనం సుమారుగా ₹ రూ.7,33,990 నుంచి రూ. 7,99,980 వరకు ఉంటుంది. ఇతర శాఖల్లోని ఎస్సై తత్సమాన పోస్టులకు ప్రారంభ వార్షిక వేతనం సుమారుగా రూ. 6,74,820 నుంచి రూ. 7,35,490 వరకు.. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు రూ.5,85,640 నుంచి ₹ 6,38,280 వరకు ఇవ్వనున్నారు.

ఇక పోలీస్ కానిస్టేబుల్ లేదా తత్సమాన పోస్టులకు ప్రారంభ వార్షిక వేతనం సుమారుగా రూ. 4,21,310 నుంచి రూ. 4,59,180 వరకు ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన వేతనంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య చికిత్స సదుపాయం, ఇళ్ల నిర్మాణం, పిల్లల విద్య, వివాహాల కోసం సంక్షేమ రుణాలు లభిస్తాయి. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనంలో 50 శాతం నుంచి 60 శాతం వరకు రిస్క్ అలవెన్స్, విధి నిర్వహణలో గాయపడితే ప్రత్యేక నష్టపరిహారం వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందజేస్తారు.

అభ్యర్థులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేసేందుకు బోర్డు చైర్మన్ టీ-శాట్, ఆల్ ఇండియా రేడియో ద్వారా ఫోన్-ఇన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా, సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ బిజీని నివారించడానికి దరఖాస్తుదారులందరూ వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని బోర్డు సూచించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి...

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ...

Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు

Are Shyamala: డీఎస్సీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది.. డీఎస్సీ...

Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!

Sheikh Hasina Extradition: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో...