Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద స్పిల్‌వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపిల్స్ సైతం సేకరించనున్నారు. ఇక, ఈ బృందంలో కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రిసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్ధార్థ్ హెడావో, సైంటిస్టు, ఏఆర్వో విపుల్ కుమార్ గుప్తాలు ఉన్నారు. త్వరలోనే మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం కూడ పర్యటనకు రానుంది.
Read Also: Physical Harassment: తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల కలకలం
అయితే, పోలవరం పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలు వేగవంతం చేశాయి. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలను కేంద్ర నిపుణుల బృందానికి వివరించనున్నారు. తన హాయంలోనే ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.