28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

PM Modi: సీఎంలతో ముగిసిన మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!

Date:

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ప్రధాని మోడీ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎదురయ్యే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై మోడీ దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో ఎక్కడా కూడా లాక్‌డౌన్ అంశాన్ని ప్రస్తావించలేదని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని తేలిపోయింది. గత కొద్దిరోజులుగా ప్రజల్లో లాక్‌డౌన్ భయాందోళనలు రేకెత్తించారు. నేటి ప్రధాని మోడీ సమావేశంతో ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఈ భేటీకి ముందు కూడా కేంద్రం కూడా లాక్‌డౌన్ వార్తలను కొట్టిపారేసింది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన సహకార సమాఖ్య వ్యూహాన్ని మోడీ గుర్తుచేశారు. ‘‘టీమిండియా’’ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇంధనం, ఎరువులు, భద్రతపై ప్రభావం చూపే దీర్ఘకాలిక ప్రపంచ అంతరాయాల గురించి హెచ్చరిస్తూనే.. కష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలిసి కట్టుగా సంక్షోభాన్ని జయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో సమన్వయం ఉండేలా చూడటమే దీని లక్ష్యం. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ఇక పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. సవాళ్లను పరిష్కరించేందుకు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక అంతర్-మంత్రివర్గ బృందాన్ని (ఐజీఎం) ఏర్పాటు చేసింది. ఇందులో అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి కీలక సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్‌ విష్ణు దేవ్‌సాయి, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, జమ్మూ కాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, పంజాబ్‌ భగవంత్‌ మాన్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం జరగనుంది.

ఇది కూడా చదవండి: Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Drone Smuggling: పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం.. రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ, 1.5 కిలోల హెరాయిన్ సీజ్!

Drone Smuggling: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ స్మగ్లర్ల కుట్రలను సరిహద్దు...

America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

అమెరికా కరెన్సీ నోట్లపై ఒక చారిత్రక మార్పు చోటుచేసుకోబోతోంది. అమెరికా చరిత్రలో...

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్...