PM Modi To Visit Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పునఃనిర్మాణంపై దృష్టిసారించింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అథారిటీ, ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.. అయితే, గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు, అమరావతి పునఃనిర్మాణానికి కూడా రాబోతున్నారు.. మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగనుంది.. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ , హైకోర్టు, రహదారులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు ఏపీ సీఎం..
Read Also: Coconut Water: వేసవిలో కొబ్బిరినీళ్లతో ఎన్ని లాభాలో..!
ఇక, ఇంఛార్జ్ మంత్రుల పర్యటనల్లో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలన్న సీఎం. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.. వచ్చే నెల 2వ తేదీన ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు.. కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిరుపతిలో గోవుల మృతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని తిప్ప కొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని మండిపడ్డారు సీఎం.. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తుంటే.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు.. జిల్లాలు యూనిట్‌గా తీసుకొని పార్టీ.. ప్రభుత్వం.. మంత్రులు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలన్నారు.. అంతేకాదు.. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరిలో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.. వ్యక్తిగత కార్యదర్శులు, వోఎస్‌డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి.. వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.