14
September, 2026

A News 365Times Venture

14
Monday
September, 2026

A News 365Times Venture

PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..

Date:

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతిఏటా రూ. 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల సొమ్మును అర్హులైన రైతుల ఖాతాలకు జమ చేశారు. చివరిసారిగా జూన్ నెలలో నగదు బదిలీ చేయగా, సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో నిధులు విడుదలవుతుంటాయి. తదుపరి 24వ విడత ఎప్పుడు వస్తుందనేదానిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పడొచ్చని అంచనా. ఆ సమయంలో వరి కోతలు, గోధుమ, బంగాళాదుంప సాగు పనులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇది రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుంది.

కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రూరల్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకుని, ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ రాష్ట్రం వివరాలతో పాటు అడిగిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ రాసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ని ఎంటర్ చేసి ధృవీకరించినట్లయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి ఆధార్ కార్డ్, భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి.

మీరు ఈ పథకానికి లబ్ధిదారుడో కాదో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘నో యువర్ స్టేటస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కిసాన్ రిజిస్ట్రేషన్ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని వెరిఫై చేస్తే మీ స్టేటస్ స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడం కూడా తప్పనిసరి. ఏదేమైనా.. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బును జమ చేస్తుంది. అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే పరిశీలిస్తుండటం మంచిది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..

Ivolga high-speed train: భారత్ తన పాతకాలపు రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించే...

UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!

UK Break-Up: యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్కాట్లాండ్, వేల్స్,...

Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..

Su-57E Stealth Fighter: చైనా, పాకిస్తాన్ సైన్యాలు తమ 5వ తరం...

Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..

మోటోరోలా నుంచి భారత మార్కెట్లోకి త్వరలో రానున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70...