5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

Peanut Rice Recipe: పిల్లల లంచ్ బాక్స్ టెన్షన్‌కు బెస్ట్ సొల్యూషన్.. 10 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ, హెల్తీ పల్లీ అన్నం!

Date:

Peanut Rice Recipe: తల్లులు పొద్దున్నే లేచి అనేక పనులు చేస్తుంటారు. పిల్లలను రెడీ చేయడం, భర్త, అత్తమామలకు కాఫీ లేదా టీ అందించడం. వాళ్లు తినడానికి టిఫిన్ ఏర్పాటు చేయడం వంటి పనుల్లో నిమగ్నమై పోతుంటారు. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో పిల్లకు లంచ్ బాక్స్ రెడీ చేయడం మరో సవాలుగా మారుతుంది. అందుకే తక్కువ సమయంలో హెల్తీతో పాటు టేస్టీగా ఉండే పల్లీ అన్నం రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Melinda Gates: ఎప్‌స్టీన్ ఫైల్ వల్లే బిల్‌గేట్స్‌తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి

పల్లీ అన్నం దక్షిణ భారత స్టైల్‌లో చేసే సింపుల్ రెసిపీ.. ఇది చాలా టేస్టీగా ఉండే రైస్ ఐటెం. ఉదయం పూట తక్కువ టైంలో దీన్ని రెడీ చేయొచ్చు. సువాసనగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకూ ఇది సేఫ్‌గానే ఇవ్వొచ్చు. ఈ అన్నంతో పాటు కొద్దిగా క్యారెట్, దోసకాయ ముక్కలు లేదా చిన్న కూరగాయ సలాడ్ ఇస్తే లంచ్ బాక్స్ పూర్తిగా రెడీ అవుతుంది. ఈ పల్లీ అన్నం బాస్మతి అన్నంతో చేసినా బాగుంటుంది. లంచ్ బాక్స్‌కు అయితే బాస్మతి అన్నం గింజలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇంకా టేస్టీగా మారుతుంది. అయితే సాధారణ సోనా మసూరి లేదా పొన్నీ అన్నంతోనూ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏదంటే.. అన్నం ముందే ఉడికించి చల్లార్చాలి. అన్నం ఉడుకుతున్న సమయంలోనే పల్లీలు, మసాలా పదార్థాలు వేయించుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇంకా సులువుగా కావాలంటే ఈ పల్లీ పొడిని రాత్రే చేసి పెట్టుకుంటే ఉదయం నేరుగా అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది.

READ MORE: BJP MP Controversy: ఈ బీజేపీ ఎంపీ బెల్టు ధర జస్ట్ లక్షే.. అందుకే పార్లమెంట్లో కవర్ చేశాడు..?

తయారీ విధానం ఇదే..
పల్లీ అన్నానికి మంచి వాసన రావడానికి కరివేపాకు, శనగపప్పు, మినపప్పు చాలా కీలకం. అందుకే ముందుగా శనగపప్పు, మినపప్పును సన్నని మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, వెల్లుల్లి వేసి వేయించాలి. వెల్లుల్లిని వేయిస్తే వాసన పోతుంది. పల్లీలు సగం వేయించాక ఎండు మిర్చి, కరివేపాకు వేయాలి. అవి కురకురలుగా మారే వరకు వేయిస్తే మంచి సువాసన వస్తుంది. చివరగా జీలకర్ర, కొబ్బరి లేదా నువ్వులు వేసి మంట ఆపేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. కొందరికి రోకలి సాయంతో మెత్తగా పొడి నచ్చుతుంది. మరికొందరికి కాస్త గరుకుగా నచ్చుతుంది. పిల్లలకు అయితే కొంచెం గరుకుగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు. కావాలంటే కొద్దిగా పల్లీలు పక్కన పెట్టి చివర్లో గార్నిష్‌గా వేసుకోవచ్చు. ఇలా దీన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అన్నం సాధారణంగానే ఉడికించి పూర్తిగా చల్లార్చాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత నేరుగా పల్లీ పొడి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి చేతితో కలిపేయాలి. లంచ్ బాక్స్ కోసం అయితే ఈ పద్ధతే ఎక్కువగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె, పల్లీ నూనె లేదా ఆలివ్ ఆయిల్ వాడితే ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పల్లీ అన్నం పిల్లల లంచ్ బాక్స్‌కు మాత్రమే కాదు.. సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్ డిన్నర్‌గా బాగుంటుంది. కడుపు నిండుగా ఉంచుతుంది. శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పెరుగుతున్న పిల్లలకు మంచిది. అంతే కాదండోయ్.. ఈ పల్లీ అన్నం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టాలి. అందులో పల్లీ పొడి, ఉప్పు వేసి మంట ఆపేసి, ఆ తర్వాత అన్నం కలపాలి. ఈ పద్ధతుల్లో మీ పిల్లల కోసం గుమగుమలాడే రైస్ రెడీ చేసి లాంచ్ బాక్స్‌లో పెట్టండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Women’s Day: తెలంగాణ మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్.. ఉచితంగానే..

తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి...

Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..

Deputy CM Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం...

Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

Divorce case: దంపతుల విడాకుల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు...

Rapido Story: ఒకప్పటి క్లాస్ టాపర్, ఇప్పుడు రాపిడో రైడర్.. జీవితం నేర్పే పాఠం.. నెటిజన్లను కదిలిస్తున్న జర్నీ..

Rapido Story: జీవితం అందరికి ఒకేలా ఉండదు. ఒకప్పుడు క్లాస్‌ టాపర్‌గా,...