1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!

Date:

PAN Card : ఆర్థిక లావాదేవీల నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుల వరకు ఈరోజుల్లో ‘పాన్ కార్డ్’ (PAN Card) అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఆస్తులు కొనాలన్నా, డీమాట్ అకౌంట్ కావాలన్నా ఈ 10 అంకెల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి అయ్యింది. అయితే, మీ కార్డుపై ఉండే ఆ 10 డిజిట్స్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుందని మీకు తెలుసా? మీ పాన్ కార్డ్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Trump: రేపు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్.. సర్వత్రా ఉత్కంఠ

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ప్రతి పాన్ నెంబర్‌లో ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. దీనిని ఐదు విభాగాలుగా విభజించవచ్చు.. అందులో మొదటిది.

1. మొదటి మూడు అక్షరాలు (AAA నుండి ZZZ):
పాన్ కార్డులోని మొదటి మూడు డిజిట్లు ఎల్లప్పుడూ ఆల్ఫాబెటిక్ సిరీస్‌లో ఉంటాయి. ఇవి ‘AAA’ నుంచి ‘ZZZ’ వరకు ఏదైనా కావచ్చు. ఇవి కంప్యూటర్ ద్వారా రాండమ్‌గా జనరేట్ చేయబడతాయి.

2. నాలుగో అక్షరం (పాన్ హోల్డర్ స్టేటస్):
ఇది చాలా ముఖ్యమైనది. కార్డు తీసుకున్నది వ్యక్తియా లేక సంస్థా అనేది ఈ నాలుగో అక్షరం ద్వారానే తెలుస్తుంది.

P – Person: వ్యక్తిగతంగా తీసుకుంటే ‘P’ అని ఉంటుంది.

C – Company: ఏదైనా కంపెనీ పేరు మీద ఉంటే ‘C’ అని ఉంటుంది.

H – HUF: హిందూ అవిభాజ్య కుటుంబం అయితే ‘H’ అని ఉంటుంది.

F – Firm: పార్టనర్‌షిప్ సంస్థలకు ‘F’ అని ఉంటుంది.

T – Trust: ట్రస్టుల పేరు మీద ఉంటే ‘T’ అని ఉంటుంది.

G – Government: ప్రభుత్వ సంస్థలకు ‘G’ అని ఉంటుంది.

3. ఐదో అక్షరం (మీ ఇంటి పేరు లేదా పేరులోని మొదటి అక్షరం):
మీరు వ్యక్తిగత పాన్ కార్డ్ (P) కలిగి ఉంటే, మీ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని (Surname) మొదటి అక్షరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ పేరు ‘పులిపాటి రమేష్’ అయితే, ఐదో అక్షరం ‘P’ అని ఉంటుంది. అదే కంపెనీ అయితే, ఆ కంపెనీ పేరులోని మొదటి అక్షరం ఇక్కడ వస్తుంది.

4. ఆరు నుంచి తొమ్మిది వరకు అంకెలు (0001 నుంచి 9999):
మధ్యలో ఉండే ఈ నాలుగు అంకెలు ఒక సీక్వెన్షియల్ నెంబర్స్. ఇవి 0001 నుంచి 9999 మధ్య ఏదైనా ఉండవచ్చు.

5. పదవ అక్షరం (ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్):
పాన్ నెంబర్‌లోని చివరి అక్షరం ఎప్పుడూ ఆల్ఫాబెటిక్ రూపంలోనే ఉంటుంది. ముందుగా ఉన్న 9 డిజిట్లకు ఒక నిర్దిష్ట ఫార్ములాను అప్లై చేసి, కంప్యూటర్ ఈ పదవ అక్షరాన్ని సృష్టిస్తుంది.

కేవలం ఒక నెంబర్ లాగా కనిపించే మీ పాన్ కార్డ్, ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో మీ పూర్తి గుర్తింపును ఇలా కోడ్ రూపంలో నిక్షిప్తం చేస్తుంది. అందుకే పాన్ నెంబర్ కేవలం అంకెలు మాత్రమే కాదు.. అది మీ ఆర్థిక చిరునామా అని ఆర్థిక విశ్లేషకులు చెబుతారు.

READ ALSO: Airtel Rs 48 Plan : ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్‌ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం...

Iran War: అమెరికాకు మద్దతుగా రంగంలోకి రెండు దేశాలు.!

Iran War: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు...

Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు...

Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్‌ డిపాజిట్‌.. నిబంధనలు విత్‌డ్రా..!

సాధారణంగా బ్యాంకుల్లోకి వెళ్తే ‘క్యాష్ డిపాజిట్’, ‘విత్‌డ్రా’ ఫారాలు కనిపిస్తాయి. కానీ...