Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. 11 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ ఆర్మీ దాడులకు పాల్పడుతుంది. నిన్న (మే 4న) రాత్రి జమ్ము కాశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీంతో అలర్టైనా భారత ఆర్మీ.. పాక్ కాల్పులను తిప్పికొట్టింది.
Read Also: NANI : హిట్ 3 ఓవర్సీస్.. మరొక మైల్ స్టోన్
ఇక, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లోని బైసారన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు.. ఈ ఘటనలో సుమారు 26 మంది చనిపోయారు.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొది. పాక్ పై భారత్ అనేక ఆంక్షలు విధించింది. ఇక, భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు సమావేశం కానుంది.