22
February, 2026

A News 365Times Venture

22
Sunday
February, 2026

A News 365Times Venture

Pakistan vs New Zealand: పాకిస్థాన్ కొంప ముంచిన వర్షం.. న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. ఇక ఇదే లాస్ట్ ఛాన్స్!

Date:

Pakistan vs New Zealand: వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. శనివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్ vs న్యూజిలాండ్ టీ20 వరల్డ్ సూపర్ ఎయిట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే సైతం లేదు. దీంతో చేసేదేమి లేక రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. వర్షం కారణంగా ఇరు దేశాలకు గడ్డు కాలంగా మారింది. సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. పాకిస్థాన్‌ ఇప్పుడు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, శ్రీలంకలతో పాక్ పోటీ పడాల్సి ఉంది. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని జట్టు ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే మొత్తం 5 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒకటి గెలిచి, ఒకటి ఓడితే 3 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే పాకిస్థాన్‌ ఇంటి బాట పట్టాల్సిందే.

READ MORE: Healthy Protein Snacks: శెనగపిండి లేని హెల్తీ ప్రోటీన్ పకోడీ.. ఇలా ‘సింపుల్’గా చేసుకోండి!

అయితే.. నేడు స్వల్పంగా వర్షం పడుతుండగా టాస్ ముగిసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తేలికపాటి జల్లులు క్రమంగా భారీ వర్షంగా మారడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టులో ఒక మార్పు సైతం చేసింది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌ను అనారోగ్యం కారణంగా మిస్ చేసిన కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి జట్టులో చేరాడు. అతనితో పాటు లాకీ ఫర్గూసన్, ఇష్ సోధీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్ డీలా పడింది. ఇక ఫిబ్రవరి 24న ఇదే వేదికలో ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 25న న్యూజిలాండ్‌ను దాయాది జట్టు ఎదుర్కోనుంది. దాయాది జట్టు ఇంటికి పయనమవుతుందా? రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ ఆడుతుందా? అనే అంశంపై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

READ MORE: Moong Dal Idli: రైస్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్.. హై ప్రోటీన్‌ ‘పెసరపప్పు ఇడ్లీలు’.. ఉదయాన్నే తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shalini Ajith : నా పిల్లలు.. బ్రతిమిలాడిన నా సినిమాలు చూడరు..

ఒకప్పుడు తన క్యూట్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి...

Donald Trump: “ఆమెను వెంటనే తొలగించండి”.. లేదంటే “భారీ పరిణామాలను” ఎదుర్కుంటారు!

Donald Trump: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, నెట్‌ఫ్లిక్స్ బోర్డ్...

Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!

టాలెంటెడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక సైబర్ నేరగాడి ఉచ్చులో...