పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ పై చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సీసీఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. పాక్ పై “భారత్ దౌత్యపరమైన దాడి”కి రంగం సిద్ధం చేసింది. భారత్ లోని పాకిస్తాన్ హైకమిషన్‌ను దశల వారీగా మూసివేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
Also Read:Pahalgam terror attack: పాక్‌పై ప్రతీకారం.. “సింధు జలాల ఒప్పందం” రద్దు, వాఘా మూసివేత..
భారత్ లోని పాక్ దౌత్యవేత్తల బహిష్కరణ.. పాకిస్తాన్ లోని భారత్ దౌత్యవేత్తల ఉపసంహరణ.. పాక్ లోని భారత్ హైకమిషన్ లో దౌత్య అధికారుల సంఖ్యను 55 నుంచి 30 కి పరిమితం చేస్తూ నిర్ణయం.. పాకిస్తాన్ పౌరులకు “సార్క్” వీసా మినహాయింపు పధకం కింద జారీ చేసే వీసాలు రద్దు.. ఇప్పటికే జారీ చేసిన వీసాలన్నీ రద్దు.. ఈ పధకం కింద భారత్ లో పాక్ పౌరుడు ఎవరైనా ఉంటే 48 గంటల్లో దేశాన్ని వీడి పాక్ కు వెళ్ళాలి.. 1960 లో పాక్ తో కుదుర్చుకున్న “ఇండస్” జల ఒప్పందం తక్షణమే రద్దు.. సరిహద్దు తీవ్రవాదానికి మద్దతును పాక్ ఉపసంహరించుకునే వరకు కొనసాగనున్న ఒప్పందం రద్దు.. అటారి సరిహద్దు “సంయుక్త చెక్ పోస్ట్” తక్షణమే మూసివేత..
Also Read:Pahalgam terror attack: పాక్‌పై ప్రతీకారం.. “సింధు జలాల ఒప్పందం” రద్దు, వాఘా మూసివేత..
సరైన పత్రాలతో భారత్ లోకి వచ్చిన వారంతా మే 1 వ తేదీ కంటే ముందే తిరిగి వెళ్ళాలి.. న్యూఢిల్లీ లోని పాక్ హైకమిషన్‌లో ఉన్న వాయుసేన, నౌకాదళ సలహాదారులు ఓ వారంలో భారత్ ను వీడిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల హైకమిషన్లలో ఉన్న సలహదారులకు సహాయకులుగా ఉండే ఐదుగురు సిబ్బందిని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన.. దాడులకు పాల్పడిన వారిని న్యాయ విచారణ చేసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం.. తీవ్రవాద దాడులను ప్రోత్సహించి, మద్దతు ఇచ్చిన వారిని బాధ్యులుగా చేయాలని తీర్మానం.. తహవ్వురు రాణా తరహాలో, భారత్ కు వ్యతిరేకంగా తీవ్రవాద చర్యలకు పాల్పడిన వారిని, కుట్రదారులను భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.