Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడికి భారతదేశం కన్నీరు కారుస్తోంది. అమాయకులైన టూరిస్టుల్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆధారాలు సేకరించాయి.
Read Also: Gorantla Madhav: నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..
ఇదిలా ఉంటే, మంగళవారం జరిగిన దాడిని అడ్డుకునేందుకు పోనీ ఆపరేటర్ వీరోచితంగా పోరాడి, మరణించాడు. స్థానిక నివాసి అయిన పోనీ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాదుల నుంచి టూరిస్టుల్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఉగ్రవాది దగ్గర నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతనాగ్ నివాసి అయిన షా, పహల్గామ్‌లో పోనీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబంలో ఇతను ఒక్కడే సంపాదిస్తున్నాడు.
దాడి నుంచి ఒక మహిళను రక్షించడానికి ప్రయత్నించే క్రమంలో, ఆదిల్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన తండ్రి మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు పని కోసం పహల్గామ్‌కు వెళ్ళాడు, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దాడి గురించి విన్నాము. మేము అతనికి కాల్ చేసాము, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. సాయంత్రం 4.40 గంటలకు అతడి ఫోన్ ఆన్ అయింది, కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అప్పుడే అతడు గాయపడినట్లు తెలిసింది. దీనికి బాధ్యులైన వారు పరిణామాలను ఎదుర్కోవాలి’’ అని అన్నారు. ఆదిల్ షా అంత్యక్రియలకు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.