పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఎన్నారైలు జాతీయ జెండాలు చేత పట్టి నిరసనలు తెలిపారు. 400 మందికిపైగా కాశ్మీరీ పండితులు, మిత్రులు, స్నేహితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా గళమెత్తారు.
అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్‌లో భారతీయులంతా రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు జేశారు. జాతీయ జెండాలను పైకి ఎత్తి ఊపారు. ఇలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నిరసనలు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో చనిపోయిన 26 కుటుంబాలకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
#WATCH | United Kingdom: Members of the Indian diaspora counter the Pakistani protest outside the Indian High Commission in London. #PahalgamTerroristAttack pic.twitter.com/woLKqFhE0E
— ANI (@ANI) April 27, 2025