Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్ర ఘటనకు భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌తో 1960లో చేసుకున్న ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన సీసీఎస్( భద్రతపై కాబినెట్ కమిటీ) సమావేశంల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
Read Also: Pahalgam Terror Attack: ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా.. జనసేన కొవ్వొత్తుల ర్యాలీ
పాకిస్తాన్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ పౌరులు దేశంలో ఉంటే రెండు రోజుల్లో వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. పౌక్ పౌరులకు గతంలో జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. పాక్ రాయబార కార్యాలయంలో సైనిక సలహాదారులు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.