ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
READ MORE: Indian Navy: దేనికైనా రెడీ.. యాంటీ షిప్ మిసైల్స్‌ను పరీక్షించిన భారత నౌకాదళం!
పహల్గాం దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఐఏ ఇప్పుడు ఈ కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉంది. ఈ దాడి వెనుక ఉన్న విస్తృత ఉగ్రవాద నెట్‌వర్క్, కుట్రను వెలికితీసేందుకు సంస్థ లోతైన దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎన్‌ఐఏ బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఈ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఉగ్రదాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నించనున్నారు.
READ MORE: Virat Kohli vs KL Rahul: ఊరమాస్ లెవెల్‌లో రాహుల్ వార్నింగ్.. ప్రతీకారానికి సిద్దమైన కోహ్లీ!
దాడి నుంచి బయటపడిన వారి వాంగ్మూలాలను నమోదు చేయనుంది. అలాగే.. లష్కరే, జైష్-ఎ-మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన అరెస్టయిన ఉగ్రవాదులను ఈ దాడిపై ప్రశ్నిస్తుంది. పలు ఆధారాల ద్వారా ఈ దాడిలో పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత్ నిర్ధారిస్తోంది. కాగా.. బైసరన్ లోయలో 26 మంది అమాయక పౌరులను చంపిన వారి కోసం ఇప్పటికే భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త దళం వెతుకుతోంది.