27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

OTR: పర్యటన వివరాలు సీక్రెట్‌గా ఉంచడంలో ఆంతర్యం ఏంటి?

Date:

OTR: ఓ మంత్రి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కలిసి హెలికాప్టర్‌లో వెళ్ళి ఏరియల్‌ సర్వే ఎందుకు చేశారు? పైగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఎందుకు జాయిన్‌ అయ్యారు? ఆ టూర్‌ వివరాలను టాప్‌ సీక్రెట్‌గా ఎందుకు ఉంచారు? ఎవరా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులు? ఎక్కడ జరిగిందా ఏరియల్‌ సర్వే?

ఆదిలాబాద్ జిల్లాలో ఇన్చార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఏరియల్‌ సర్వే చేశారన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి భీంపూర్, బోరజ్ మండలాల పరిధిలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని అధికారులు ప్రకటించారు కూడా.

Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత సంచలనం

అయితే… దీనికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో మాత్రం ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంత పరిశీలన అని ఉంది. భోరజ్ మండలంలోని కొరాటా- చనాకా ప్రాజెక్ట్ సమీపంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించారని అందులో ఉంది. ఇక్కడే అసలైన అనుమానాలు మొదలయ్యాయి. అధికారులు చెప్పినదానికి, ఎమ్మెల్యే కార్యాలయ ప్రకటనకు పొంతనలేకపోవడంతో తెర వెనక ఏదో జరిగితోదోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. చనాకా కోరాట ప్రాజెక్టును జనవరి 16న సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకింత చేశారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన చిన్న కాల్వలు ఇంకా పూర్తి కాలేదు. పైగా భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో…ఆగమేఘాల మీద ఏరియల్‌ సర్వే చేయడం, ప్రభుత్వ పెద్దలు వస్తే గోప్యత పాటించడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు అంటే…దానికి సంబందించిన వ్యవహారాలను టీజీఐఐసీ చూస్తుంది. ఆ సంస్థ ఎండీ శశాంక్ సైతం మీటింగ్‌కు వచ్చారు. ఇక్కడ పారిశ్రమికవాడ కోసం దాదాపు పదివేల ఎకరాల భూమి అవసరం అవుతుందని గతంలో అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ భూములు హత్తీఘాట్ శివారులో ఉన్నాయని ఓనేత చెప్పడంతోనే… ప్రభుత్వ పెద్దలు గాలి మోటర్ లో వచ్చివెళ్ళారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే చాలామంది నాయకులు తక్కువ ధరకు కొన్నారని, కొంతమంది బినామీల భూములు అధికంగా ఉన్నాయని, వాటిని పరిశ్రమల పేరుతో సేకరించి ఎక్కువ ధర ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగురామన్న అయితే…. ఎమ్మెల్యే పాయల్ శంకర్ బందువులు ,బినామీల భూములు ఉన్నాయంటూ మీడియాకు ఓ చిట్టాను చూపించారు.

లాభం ఎవ్వరిది, ఉపయోగం ఎవ్వరికి అన్న విషయం పక్కన పెడితే.. జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు ఇద్దరు హెలికాప్టర్‌లో రావడం, ఆ పర్యటన అంతా సీక్రెట్ గా సాగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.పైగా ఒక్క ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ మాత్రమే ప్రభుత్వ పెద్దలతో కలిసి ఏరియల్ సర్వే చేయడం సైతం మిస్టరీగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చినవాళ్ళు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు. కానీ… ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి సర్వేలు చేయడం రాజకీయ చర్చలకు తావిస్తోంది. హత్తీఘాట్ భూములపై ఎవరైనా కన్నేశారా…అందుకోసమే అంత గోప్యత పాటించారా.. ప్రజాప్రయోజన కార్యక్రమాలు అయితే గోప్యంగా పర్యటించి వెళ్ళాల్సిన పనేంటనే ప్రశ్నలొస్తున్నాయి.

TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

నిజంగానే ప్రభుత్వ కార్యక్రమాల కోసం వచ్చినట్టైతే మీడియాను దూరంగా ఉంచడం ఎందుకన్నది ఇంకో క్వశ్చన్‌. ఇక్కడ పనికి రాని బర్కం భూములు అధికంగా ఉన్నాయి. సాగుకు యోగ్యం కానివి కొన్ని,సాగుకు పనికొచ్చేవి సైతం మరికొన్ని ఉన్నాయి. పైగా సీబీఐ కేసులో ఈడికి అటాచ్ చేసినవి సైతం ఈ ప్రాంతంలో 24 వందల ఎకరాలున్నట్టు ఆరోపిస్తున్నారు రాజకీయ నేతలు. ఎవ్వరో ప్రైవేట్ వ్యక్తులు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం కోసం వెదుకుతున్నారు చాలామంది. అన్నిటికీ మించి…జిల్లాలో మంత్రి పర్యటన ఉంటే హడావుడి చేసే అధికారులు… ప్రభుత్వ పెద్దలొస్తే మాత్రం ఆ కార్యక్రమాలకు మీడియాకు అనుమతి నిరాకరించడం ఏంటన్న సందేహాలు సైతం పెరుగుతున్నాయి. మొత్తం మీద వాళ్ళు వచ్చింది ఎందుకైనా…. ప్రభుత్వంలోని ముగ్గురు ముఖ్యులు కలిసి బీజేపీ ఎమ్మెల్యేతో ఏరియల్‌ సర్వే చేయడం మాత్రం కలకలం రేపుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్‌ సూచనలు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా,...

Off The Record: బట్టబయలైన పాలమూరు కాంగ్రెస్‌ గ్రూప్‌ పాలిటిక్స్‌

Off The Record: పాలమూరు మేయర్‌ ఎన్నిక ఎపిసోడ్‌లో చిత్ర విచిత్రాలు...

Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

Ragi Barfi Recipe : రాగి అనేది మన సంప్రదాయ ఆహారాలలో...