9
April, 2026

A News 365Times Venture

9
Thursday
April, 2026

A News 365Times Venture

OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

Date:

OTR: ఏపీ సీఎం చంద్రబాబు వస్తున్నారంటేనే అక్కడి ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారట. ఆయన మా దగ్గరికి రాకుండా ఉంటేనే బాగుండురా బాబూ అంటూ.. మొక్కుకుంటున్నారట. ఏ జిల్లాలో టీడీపీ శాసనసభ్యులు అంతలా భయపడిపోతున్నారు? ముఖ్యమంత్రితో పాటు అభివృద్ధి నిధులు వస్తాయని సంబరపడాల్సిన సందర్భంలో ఎందుకు వాళ్ళలో టెన్షన్‌ పెరుగుతోంది?

ఐవిఆర్ఎస్ సర్వే.. ఈ మాట వింటేనే, సింహపురి టీడీపీ ఎమ్మెల్యేలు షేకైపోతున్నారు. అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని మెజార్టీ శాసనసభ్యులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. పైగా.. ఆ రిపోర్ట్స్‌ ఆధారంగా సీఎం చంద్రబాబు జిల్లా టూర్స్‌లో ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకుతుండటంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ అంటేనే భయపడుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ పనితీరు గురించి వచ్చిన ఐవీఆర్‌ఎస్‌ సర్వే గురించి వివరించడంతోపాటు ఇద్దరికీ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది.

Kadiri YSRCP Politics: కదిరి వైసీపీలో మూడు రెక్కలాట.. బాషా, మక్బూల్, పూల మధ్య గేమ్‌!

దీంతో తర్వాత ఎవరి వంతు వస్తుందోనన్న కంగారు అందరిలో పెరుగుతోందట. అందుకే తమ తమ నియోజకవర్గాల్లో ఈ సర్వేకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా అంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. సహజంగా ఎమ్మెల్యేలు ఎవరైనా… మా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు. సీఎం టూర్‌తో పాటు అభివృద్ధి నిధులు, పెండింగ్‌ సమస్యల పరిష్కారం, ఇతరత్రా రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆశిస్తారు.

కానీ… ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఐవీఆర్ఎస్‌ సర్వే, సీఎం క్లాస్‌లతో ఆ పర్యటనలంటేనే భయపడుతున్నారట. నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగే ఒకరిద్దరు తప్ప…మిగతా వాళ్లంతా ముఖ్యమంత్రి మా దగ్గరికి రాకపోతే చాలురా బాబూ అన్నట్టు ఫీలైపోతున్నారట. ఆయన వస్తూ వస్తూ…ఏయే సామాజిక వర్గాలు దూరంగా ఉన్నాయి..? పార్టీలో ఎంత శాతం ఎమ్మెల్యే పై అసంతృప్తిగా ఉన్నారు..? ప్రజా సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నారా లేదా..? అసలు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా లేదా లాంటి రకరకాల సర్వే రిపోర్ట్స్‌ను వెంటబెట్టుకుని వస్తారు.

వాటి ఆధారంగా క్లాస్‌లు తీసుకుంటే తట్టుకోలేమన్నది ఎమ్మెల్యేల మాటగా తెలుస్తోంది. ఇటీవల నాయుడుపేట, వింజమూరులో పర్యటించిన చంద్రబాబు.. సర్వే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనావేసి వారికి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మెజారిటీ శాసనసభ్యుల మీద ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఇసుక, గ్రావెల్ ప్రధానమైనవి. ఈ క్రమంలో చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళనలో కొందరు ఉన్నట్టు సమాచారం.

Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

చంద్రబాబు వస్తే ఎక్కడ తలంటేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారట ప్రజాప్రతినిధులు. మరోవైపు జిల్లాతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో ఉండే కొందరు అధికారుల పనితీరు సరిగా లేకపోవడం కూడా ఎమ్మెల్యే పై ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అధికారులతో సరిగా పనిచేయించుకోవడంలేదన్న భావన టీడీపీ పెద్దలకు ఉందట.

అందుకే అసలు కంటే కొసరు మీద దృష్టిపెట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులను లిస్ట్ ఔట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్‌ ఉందని అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. సర్వే కోసం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ర్యాండమ్‌గా వెళ్లే క్రమంలో… వైసీపీ సానుభూతి పరులకు కూడా వెళ్తున్నాయని, వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నందువల్ల కొన్ని అంశాల్లో తమకు తక్కువ పర్సంటేజ్ వస్తోందన్నది వాళ్ళ ఆవేదన. అయితే.. ఈ ర్యాంకింగ్‌ గురించి కొందరే ఆలోచిస్తున్నారని, మరి కొందరు మాత్రం మా దారి దందారి అంటూ అడ్డసుడిగా చెలరేగుతూనే ఉన్నారన్నది జిల్లా టాక్‌. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఈ సర్వేలు, సీఎం క్లాస్‌లతో మాత్రం చాలా మంది భయపడుతున్నారన్నది విస్తృతాభిప్రాయం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్...

Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణించే చమురు నౌకలపై...

Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’...

Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా...