Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి 1 తేదీలు అత్యంత చీకటి రోజులుగా లిఖించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేసింది. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఈ మెరుపు దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ, సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై కుట్రలు పన్నుతున్న ఇరాన్ పాలనా వ్యవస్థ స్తంభాలు ఈ దాడులతో కుప్పకూలాయి. ఈ దాడుల్లో అమెరికా – ఇజ్రాయెల్ అత్యంత ఆధునిక ఫైటర్ జెట్లు, క్షిపణులతో ఇరాన్ రక్షణ నాయకత్వం ఉండే ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత పకడ్బందీ పరిశోధన, ప్రణాళిక తర్వాతే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన ఏడుగురు అత్యున్నత స్థాయి సైనిక అధికారులు మరణించినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం అధికారిక జాబితాను విడుదల చేసింది.
READ ALSO: Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..
మరణించిన ఇరాన్ అగ్రనేతల జాబితా:
ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ రంగాన్ని శాసించే కీలక వ్యక్తులు తుడిచిపెట్టుకుపోయారు..
అజీజ్ నసీర్జాదే: ఇరాన్ రక్షణ మంత్రి (ఇప్పుడు చరిత్రగా మిగిలారు).
మొహమ్మద్ పాక్పూర్: ఐఆర్జీసీ (IRGC)కి చెందిన అత్యంత శక్తివంతమైన కమాండర్-ఇన్-చీఫ్.
అలీ షంఖానీ: ఇరాన్ సుప్రీం లీడర్‌కు అత్యంత విశ్వసనీయ సలహాదారు.
మొహమ్మద్ షిరాజీ: సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో ప్రధాన వ్యూహకర్త.
సలేహ్ అస్సాది: ఇరాన్ నిఘా వ్యవస్థ (Intelligence) ప్రధాన సూత్రధారి.
హోస్సేన్ జబల్ అమేలియన్: రక్షణ పరిశోధన సంస్థ (SPND) అధ్యక్షుడు.
రెజా మొజాఫారి-నియా: అణు కార్యక్రమం కీలక వ్యూహకర్త, SPND మాజీ అధ్యక్షురాలు.
శతాబ్దాల పాటు మానని గాయం
ఇరాన్ ఛాతీపై ఇజ్రాయెల్ చేసిన ఈ గాయం ఆ దేశాన్ని శతాబ్దాల పాటు వేధించనుంది. అణు కార్యక్రమం నుంచి నిఘా విభాగం వరకు, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఐఆర్జీసీ వరకు అన్ని కీలక విభాగాలు తమ అగ్రనేతలను కోల్పోవడంతో ఇరాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అమెరికా మద్దతుతో జరిగిన ఈ దాడులు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యానికి గండికొట్టాయి. ఈ ఏడుగురు అగ్రనేతల మరణం ఇరాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ELIMINATED:
IAF fighter jets precisely struck military targets across Iran, eliminating 7 senior officials of the Iranian Defense Leadership:Ali Shamkhani, Mohammad Pakpour, Saleh Asadi, Mohammad Shirazi, Aziz Nasirzadeh, Hossein Jabal Amelian, Reza Mozaffari-Nia.
The world… pic.twitter.com/4oOj2Y7DMt
— Israel Defense Forces (@IDF) February 28, 2026



ELIMINATED:
