Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది.
అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో ఎం.టెక్ విద్యార్థిగా చదువుతున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో క్రికెట్ , ఇతర గేమ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో, పవన్ సుమారు 1 లక్ష రూపాయలను నష్టపోయాడు. తన వద్ద ఉన్న ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను విక్రయించడంతో పాటు, తల్లిదండ్రులు చదువు కోసం పంపిన డబ్బులను కూడా బెట్టింగ్‌లో స్వాహా చేశాడు. నష్టాలను భర్తీ చేయలేక, రుణాల ఒత్తిడితో తీవ్ర మానసిక ఒడిదుడుకులకు గురైన పవన్, చివరకు తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పవన్ ఉపయోగించిన బెట్టింగ్ యాప్‌లు, అతని ఆర్థిక లావాదేవీలు, , ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను పోలీసులు విచారిస్తున్నారు. పవన్‌కు రుణాలు ఇచ్చిన వ్యక్తులు లేదా బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. “పవన్ బెట్టింగ్ యాప్‌లకు బానిసై, ఆర్థికంగా కుంగిపోయాడు. అతని మొబైల్ ఫోన్ , బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం,” అని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Shabbir Ali : జడ్జిలకు మా కృతజ్ఞతలు.. కోర్టు ద్వారా మాకు మంచి న్యాయం లభించింది