మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా?.. ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ డీల్ అందుబాటులో ఉంది. ఆఫర్‌లతో OnePlus 13 పై 9 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం OnePlus 13 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 9,700 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. OnePlus 13 ను కంపెనీ దేశంలో రూ. 69,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో కూడా, ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.69,999, కానీ ఫ్లాగ్‌షిప్ పరికరం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,299కి అందుబాటులో ఉంది.
Also Read: Malavika Mohanan : ట్రైన్ లో ముద్దిస్తావా అన్నాడు.. మాళవిక షాకింగ్ కామెంట్స్
అంటే, ఫోన్‌పై రూ. 5,700 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. కంపెనీ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై (12 నెలలు) రూ. 4,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లతో రూ. 9,700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ చేంజ్ చేసుకుని మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు.
Also Read: Bandi Sanjay : ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా..?
OnePlus 13 స్పెసిఫికేషన్లు
OnePlus 13 లో మీరు HDR10 + మద్దతుతో 6.82-అంగుళాల LTPO 3K డిస్ప్లేని పొందుతారు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 24GB LPDDR5X RAM, 1TB UFS 4.0 స్టోరేజ్‌తో అనుసందానించబడింది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. OnePlus 13 లో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీలు , వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.