2
April, 2026

A News 365Times Venture

2
Thursday
April, 2026

A News 365Times Venture

Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..

Date:

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన రోడ్‌స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది.

ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..?
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా కంపెనీ తన ‘గిగా ఫ్యాక్టరీ’లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘4680 భారత్ సెల్’ అనే బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ సెల్స్ ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడంతో తయారీ ఖర్చులు బాగా తగ్గాయి. సొంతంగా బ్యాటరీలు తయారు చేసుకోవడం వల్ల కలిగిన ఈ ఆర్థిక లాభాన్ని కంపెనీ నేరుగా కస్టమర్లకే బదిలీ చేయాలని నిర్ణయించుకుంది.

ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు..?
అయితే.. ఈ బైక్‌ను ఎప్పుడు పడితే అప్పుడు కొనే అవకాశం లేదు. దీనిని కేవలం పరిమిత సమయ విండోల్లో (Limited Purchase Windows) మాత్రమే విక్రయించాలని ఓలా నిర్ణయించింది.

మొదటి కొనుగోలు అవకాశం ఏప్రిల్ 3న (శుక్రవారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఇలాంటి మరిన్ని సేల్ విండోలను భవిష్యత్తులో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.

రోడ్‌స్టర్ X+ ప్రత్యేకతలు..
ఈ బైక్ పనితీరు విషయానికి వస్తే, ఇది ఒక రేంజ్ కింగ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్‌కు డిమాండ్ 5 రెట్లు పెరిగిందని కంపెనీ చెబుతోంది.

పుంజుకున్న ఓలా అమ్మకాలు..
గత మార్చి నెలలో ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రిజిస్ట్రేషన్లు 150 శాతం పెరిగాయి. ఆ నెలలో మొత్తం 10,117 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లు రావడం గమనార్హం. కేవలం వాహనాల అమ్మకాలే కాకుండా.. సర్వీస్ సెంటర్ల మెరుగుదల, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడంలో ఓలా సఫలమైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి.. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘బ్లాక్’...

SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

దర్శకధీరుడు రాజమౌళి ఏది చేసిన సంచలనమే. ఆయన సినిమా వస్తుందంటే చాలు.....

Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

ఇరాన్‌ అంతు చూస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచ...

Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్...