6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?

Date:

Off The Record: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. విపక్షం బీఆర్‌ఎస్ ఇప్పటికే ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించి.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడంపై దృష్టి పెట్టిందట గులాబీ అధిష్టానం. ఇదే సమయంలో రాజకీయ సమన్వయం ఎలా ఉండాలన్న అంశంపైనా… బీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. లెఫ్ట్ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. కలిసి వచ్చేవారి మద్దతు తీసుకోవాలనే యాంగిల్‌లో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌, లెఫ్ట్‌… అదే పొత్తును కొనసాగిస్తున్నాయి. దాంతో… కంకి కొడవలిని వదిలేస్తే.. ఇక సుత్తీ కొడవలి తమకు అనుకూలంగా ఉంటుందేమోనని ఆశగా చూస్తోందట బీఆర్‌ఎస్‌ నాయకత్వం.

ఇదే విషయమై సీపీఎం సీనియర్‌ నేత తమ్మినేని వీరభద్రం కూడా రియాక్ట్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ తమను సంప్రదించినట్టు చెప్పుకొచ్చారాయన. ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు సీపీఎం లీడర్స్‌. అలాగే… తెలంగాణలో అంతో ఇంతో ప్రభావం చూపగలిగే… న్యూ డెమోక్రసీ లాంటి ఇతర లెఫ్ట్‌ పార్టీల మద్దతు కూడా అడగాలని భావిస్తోందట బీఆర్ఎస్. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవగాహన కుదిరితే.. దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్న ఉద్దేశ్యం బీఆర్‌ఎస్‌ పెద్దలకు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా… లెఫ్ట్ పార్టీలకు స్టూడెంట్ వింగ్స్ బలంగా ఉంటాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్శిటీ స్థాయి స్టూడెంట్స్ కీలకం. అందుకే… విద్యార్థి విభాగాలు బలంగా ఉండే పార్టీల మద్దతు కోసం ప్లాన్‌ చేస్తోందట బీఆర్‌ఎస్‌. ప్రత్యేకించి ఎన్నికలు జరగబోయే రెండు ఎమ్మెల్సీ సీట్ల పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి.

అందుకే… ఇప్పుడు లెఫ్ట్‌ మద్దతును చాలా కీలకంగా భావిస్తోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఇప్పుడు మద్దతు పేరుతో కలిసి పని చేసి కెమిస్ట్రీ కుదిరితే… వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి పొత్తుతో వెళ్లే దిశగా ఆలోచించవచ్చని గులాబీ నేతలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు కమ్యూనిస్టుల మద్దతు పై పూర్తి సమాచారాన్ని అధిష్టానికి ఇచ్చే పనిలో ఉన్నారట పల్లా. గతంలో లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం బీఆర్ఎస్ కు ఉంది. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంటే కింది స్థాయి కేడర్‌లో కూడా సఖ్యత కుదురుతుందని అనుకుంటున్నారట. పట్టభద్రుల స్థానాల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తయిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతోంది బీఆర్‌ఎస్‌. ఆలోపే కలిసివచ్చే లెఫ్ట్ పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉందట. అభ్యర్థి ప్రాతిపదికన మద్దతు కాకుండా పార్టీకి ఇచ్చే విధంగా పావులు కదుపుతోందంటున్నారు. ఇలా…. ఇప్పుడు సెట్‌ అయితే… దీన్ని బేస్‌ చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రూట్‌ క్లియర్‌ చేసుకోవాలన్నది కారు పార్టీ ప్లాన్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాకిచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన...

GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 7న...

Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కీలక...

FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీకి చెందిన మాజీ BJYM జాతీయ...