24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Off The Record: జీవీ ఆంజనేయులు పరువు పోయిందా? సొంత పార్టీలోనే ఎమ్మెల్యేకు ఎదురుగాలి!

Date:

Off The Record: ఓపెన్‌ విత్‌ స్పాట్‌ చంద్రబాబు జీవీకి క్లాస్‌ పీకుతున్నది వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన ఈ సంభాషణే ఇప్పుడు పల్నాడు పాలిటిక్స్‌లోహాట్‌ టాపిక్‌ అయింది. ముఖ్యమంత్రి ముందు బీభత్సమైన బిల్డప్‌ ఇవ్వబోయిన జీవీ…బూమరాంగ్‌ అయి బొక్కబోర్లా పడ్డట్టు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటల విషయమై గొప్పలు చెప్పబోయిన ప్రభుత్వ చీఫ్‌విప్‌కు బ్రేకులేసిన సీఎం… ముందు పనిచేసి చూపించమని అన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వన్‌ అండ్‌ వోన్లీ లీడర్‌ జీవీ ఆంజనేయులు. నియోజకవర్గంలో పొలిటికల్‌గా ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటున్నా… 2024లో గెలిచాక పనితీరులో బాగా వెనుకబడ్డారన్నది లేటెస్ట్‌ వాయిస్‌. వినుకొండ తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న సింగరచెరువు ఆక్రమణలకు అడ్డుకట్ట వెయ్యలేకపోవడంతోపాటు ప్రధాన సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన చీఫ్‌విప్‌ పదవి దక్కినా…. యాక్టివ్‌గా నియోజకవర్గాన్ని డెవలప్‌ చేయడంలో మాత్రం బాగా వెనుకబడ్డారన్న అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. మూడు విడతలు గెలిచాను కాబట్టి… ఈసారి కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందని ఆశించారట. అది దక్కకున్నా…. చీఫ్‌విప్‌గా ఛాన్స్‌ ఇచ్చారు.

కేబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చినా… జీవీ దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు తప్ప లోకల్‌ డెవలప్‌మెంట్‌, పార్టీని పటిష్టం చేయడం లాంటి విషయాల్లో పట్టింపులేనట్టుగా ఉంటున్నారన్న విమర్శలు పెరుగుతున్న టైంలోనే… తాజాగా వినుకొండలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఆ టూర్‌ను తనకు అనుకూలంగా మల్చుకోవాలని చీఫ్‌విప్‌ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్‌ అయి చివరికి పరువు పోగొట్టుకున్నారన్న చర్చలు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి పల్నాడు జిల్లాలో. తాను అనుకున్నది ఒకటైతే… జరిగింది మరొకటని చెప్పుకుంటున్నారు. టూర్‌లో భాగంగా ప్రజావేదిక దగ్గరికి వెళ్లడానికి ముందు ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు ముఖ్యమంత్రి. ఆ టైంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే.. వినుకొండలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఇక్కడ 50వేల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగు చేస్తామని కూడా చెప్పారు. అందుకు సీఎం ఇచ్చిన రియాక్షన్‌ గురించే ఇప్పుడు చర్చంతా. నువ్వు ఎప్పుడూ ఇలాగే అంటావు… పనిచేసి చూపించు అంటూ గాలి తీసేశారు. అసలు నియోజకవర్గంలో నీకు ఉండేదే లక్ష ఎకరాలు అంతకంటే ఎక్కువ లేదంటూ ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడంతో ఇక నోట మాటరాక జీవీ ఆంజనేయులు కామ్‌ అయిపోవాల్సి వచ్చిందట.

ఆ పరిశీలన తర్వాత పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే జీవీకి చుక్కలు కనపడ్డాయట. ఐ టీడీపీ యాప్ ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలను అప్ లోడ్ చెయ్యడంలో వినుకొండ రాష్ట్రంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉందని ఆ మీటింగ్‌లో చంద్రబాబుతో చెప్పారట ఆంజనేయులు. దీంతో… వినుకొండ నెంబర్ వన్ లో ఉందా అని ఆశ్యర్యపోయిన చంద్రబాబు తన దగ్గరున్న డేటా బయటకు తీసి చూపించి…. నువ్వు చెప్పినంత సీన్ ఇక్కడ లేదని క్లారిటీ ఇచ్చేశారు. సీఎం చూపించిన లెక్క ప్రకారం ఐ టీడీపీ యాప్ ఉపయోగించడంతో వినుకొండ 86వస్థానంలో ఉంది. ఆ విషయమే చెప్పి ఎమ్మెల్యే గాలి తీసేశారట ముఖ్యమంత్రి. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఇలా ప్రకటించడంతో అందరూ షాక్ అయినట్టు తెలిసింది. తర్వాత మీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది… మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా సర్వే రిపోర్ట్ ఉందని చెప్పిన చంద్రబాబు నియోజకవర్గంలో 84శాతం ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఉన్నారని షాకింగ్ రిపోర్ట్ బయటపెట్టారట.

అంతేకాదు, అందుబాటులో ఉండడం లేదని 54శాతం అంటున్నారని స్వయంగా అధినేతే చెప్పడంతో జీవీతోపాటు ఆయన అనుచరులకు కూడా నోట మాట రాలేదని చెప్పుకుంటున్నారు. మంచితనంలో నాలుగోస్థానంలో ఉన్నావని చెబుతూనే… నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే మంచితనం మాత్రమే సరిపోదంటూ చురకలంటించారట. గత ఎన్నికల్లో 30వేల మెజార్టీతో గెలిచానని జీవీ చెప్పడంతో ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నట్లు నా రిపోర్టులో ఉందని, ఆ రిపోర్ట్ ఇంతమంది ముందు చెప్పకూడదని కూడా చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఇలా అడుగడుగునా ఆ టూర్‌లో జీవీ ఆంజనేయులుకు షాకుల మీద షాకులు తగిలాయి. ఇక ఎమ్మెల్యే జీవీ వ్యవహారశైలికూడా మారిపోయిందని కార్యకర్తలతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార జరుగుతోంది. ప్రధాన సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఏడాదిన్నర టైంపాస్‌ చేశారన్న మాటలు సొంత పార్టీనుంచే వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా సీఎం టూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి తీసేసినట్టయిందన్న మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?

Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా...