30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Off The Record: వైసీపీ వాళ్ళయినా ఒకే.. ఇవ్వాల్సింది ఇస్తే చాలు అంటున్న కూటమి ఎమ్మెల్యే కొండబాబు?

Date:

Off The Record: ఆ ఎమ్మెల్యే గడుసుతనం మామూలుగా లేదట. మన పార్టీనా? ప్రత్యర్థి పార్టీనా అన్నదాంతో సంబంధం లేదు. మనకు పనికొస్తారా లేదా అన్నదే ముఖ్యం అంటూ….. కొత్త రకం రాజకీయం మొదలుపెట్టారు. ఒకవైపు సొంత పార్టీ నేతలకు నేను పైరవీలు చేయను, పార్టీకి బ్యాడ్‌ నేమ్‌ వస్తుందని బిల్డప్‌లు ఇస్తూ… తెర వెనక మాత్రం చాలా వ్యవహారం నడుపుతున్నారట. ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన అప్లయ్‌ చేస్తున్న కొత్త ఫార్ములా?

Read Also: Off The Record: వైసీపీలో అత్యంత కీలక మార్పులు.. వైఎస్ జగన్ క్లియర్ కట్ ఇండికేషన్స్

వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ… ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే. ఏదైనా సరే..సిస్టమేటిక్‌గా ఉండాలని అంటున్నారట. అనవసరంగా అన్నిటిలో వేళ్ళు పెట్టి.. చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నన్నట్టు సమాచారం. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌లను సొంత పార్టీ నేతలు అడుగుతుంటే నో చెబుతున్నారట ఎమ్మెల్యే. దీంతో చాలామందికి ఎక్కడో డౌట్‌ కొడుతోందట. ఈయనేంట్రా.. ఇలా మారిపోయారు? మామూలుగా అయితే, ఇలా ఉండరే.. ఎందుకని ఈసారి తీరు వేరుగా ఉందని ఆరా తీస్తే.. కొత్త కొత్త సంగతులు బయటికొస్తున్నాయట.

Read Also: Group 1 Exams 2025: రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే!

అయితే, ఆయనేం అంత క్లియర్‌గా లేరు.. అసలు మేటర్‌ వేరే ఉందని అంటున్నారట కాకినాడ టీడీపీ కార్యకర్తలు. తనకోసం లెక్క సరి చేసే పనుల్ని చుట్టూ ఉండే ముగ్గురు నలుగురికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు. అవతలి వాళ్ళు వైసిపి వాళ్ళు అయినా ఫర్వాలేదు. వర్క్‌లు ఇచ్చేయండి.. మనకు రావాల్సింది వస్తే చాలు.. అంతకు మించి పెద్దగా ఆలోచించవద్దంటూ.. ఎక్కడా.. తాను ఇన్వాల్వ్ కాకుండా పనులు చక్కబట్టేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో చిన్న చిన్న పనులు దగ్గర నుంచి పెద్ద వ్యవహారాల దాకా.. అంతా.. ఒక లెక్క ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాకినాడ సిటీ వైసిపి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చూస్తున్నారు. గతంలో టిడిపి మీద ఓ రేంజ్‌లో విమర్శలు చేశారాయన. కానీ… ఇప్పుడవన్నీ వదిలేయమంటున్నారట ఎమ్మెల్యే కొండబాబు. ద్వారంపూడి అనుచరులు అయితే ఏంటి? మరొకరైతే మనకేంటి? మనకు ఉపయోగపడతారనుకుంటే చాలు.. వాళ్ళకూ మనం ఉపయోగపడదామని ఆ ముగ్గురు నలుగురికి సూటిగా చెప్పేసినట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యే కొండబాబు అన్న కొడుకు ఉమా. గత ఎన్నికల్లో తీవ్ర తర్జన భర్జనల మధ్య ఉమాని కాదని కొండబాబుకి సీటు ఇచ్చింది టీడీపీ అధిష్టానం.

Read Also: Pakistan: ‘‘మహాప్రభో మమ్మల్ని కాపాడండి’’.. సౌదీ, యూఏఈ సాయం కోరిన పాక్ ప్రధాని..

కాగా, సొంత బాబాయే కదా… అందులోనూ అధికార పార్టీ కాబట్టి తనకేవన్నా పనులు అప్పగిస్తారని చూస్తుంటే.. అబ్బే అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని క్లారిటీగా చెప్పేస్తున్నారట. మనకు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళన్న తేడా లేదు. ఉపయోగపడటం ముఖ్యం అంటూ.. కొత్త పల్లవి అందుకుంటున్నారట ఎమ్మెల్యే. మీకు ఏవన్నా పనులు ఇస్తే.. అనవసరంగా మన కుటుంబం మీద వేరేవాళ్ళు విమర్శలు చేస్తారు. అది నేను తట్టుకోలేనంటూ గడుసుగా చెబుతున్నట్టు తెలిసింది. అలాంటి వ్యవహారాలు నన్ను అడగవద్దు. నేను చేయను అని అన్నయ్యకి కూడా హ్యాండ్ ఇచ్చేస్తున్నారట ఎమ్మెల్యే. మనతో నోట్‌ మాటలు తప్ప… నోటి మాటలు అవసరం లేదన్నట్టుగా ఉందట కొండబాబు వ్యవహారం. దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకోకుంటే.. తర్వాత మిగిలేదేం ఉండదంటూ భవిష్యత్‌ చిత్రాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా ఫలానా పని కావాలని అడిగితే.. అంతా కార్పొరేషన్ విధివిధానాల ప్రకారం జరుగుతాయంటూ రూల్స్‌ మాట్లాడుతున్నట్టు సమాచారం.

Read Also: Black, White & Gray – Love Kills Review: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ

ఇక, అదే సమయంలో మీట ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేసి మేటర్‌ సెటిల్‌ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. మీరు ఎమ్మెల్యే…. మీరు చెబితే ఆ మాత్రం పని అవదా అని ఎవరన్నా ప్రశ్నిస్తే… అలాంటి వాటికి నేను దూరంగా ఉంటున్నాను కదా అని రివర్స్ అటాక్ చేసేస్తున్నారట.. రాజకీయాలలో మన పర బేధం ఉండకూడదని కొత్త సూక్తులు వల్లెవేస్తున్నారట కొండబాబు. మనతో కలిసొచ్చిన వాళ్ళని మనం కలుపుకొని పోవాలంటూ లాజిక్‌ చెబుతున్నట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వ పదవుల నుంచి ప్రతి విషయంలోను ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా… ఎమ్మెల్యే వైఖరితో తమ్ముళ్ళు తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం. మొత్తానికి కొండబాబు చాలా స్మార్ట్ గా పనులు చక్కబెడుతున్నారని, అందుకే ఆయన ఇస్మార్ట్‌ ఎమ్మెల్యే అంటూ సెటైర్స్‌ వేసుకుంటున్నారు కాకినాడ టీడీపీ కార్యకర్తలు. ఈ నాలుగేళ్లు పోతే మనల్ని ఎవరూ పట్టించుకోరు కాబట్టి అలా బండి లాగించేయాలని నిర్ణయించుకున్నారట కొండబాబు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న భారీ దందాను...

RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై...

ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25...

Upcoming Smartphones: బడ్జెట్‌ రెడీ చేసుకోండి.. రియల్‌మీ, రెడ్‌మీ, వివో, వన్‌ప్లస్, ఒప్పో ఫోన్స్ విడుదలకు సిద్ధం

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు బడ్జెట్ రెడీ చేసుకోండి. ఏప్రిల్...