11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

Date:

Off The Record: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారట. పైగా… అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయని, అసలు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే… మనం అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ కేడరే గుసగుసలాడుకుంటోంది. ఈసారి పవర్‌లోకి వచ్చి దాదాపు రెండేళ్ళవుతున్నా…. ఇప్పటికీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌ని నియమించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి వాతావరణమే ఉన్నా… ప్రస్తుతం వ్యవహారం బాగా ముదురుతోందని అంటున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితి కారణంగా స్థానిక నేతల మధ్య అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోందట. ముఖ్యంగా స్థానిక దళిత నాయకుడికే ఇన్ఛార్జ్‌ పదవి ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. స్థానికేతరుల పేర్లు ప్రస్తావనకు వస్తేనే ఆ వర్గం మండిపడుతోంది.

నియోజకవర్గంలోని మెజార్టీ కేడర్‌ అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో….లోకల్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి, తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయట. తరచూ నిర్వహించే పార్టీ సమావేశాలు వాగ్వివాదాలతో రచ్చరచ్చగా మారుతుండటమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటున్నట్లు సమాచారం. రానురాను పరిస్థితి ఇంకా దిగజారుతోంజేతప్ప… కొంచెం కూడా మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదన్నది నియోజకవర్గ కార్యకర్తల మాట. పార్టీ అధిష్టానం సూచించిన కమిటీని పట్టించుకోకుండా, ఒక వర్గం నాయకులు ముందుగానే తమ సొంత మండల కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. అధిష్టానం ఎంపిక చేసిన అధ్యక్షురాలిని కూడా బహిరంగంగా వ్యతిరేకించారు.

మరోవైపు అధిష్టానం సూచించిన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో, నియోజకవర్గంలో రెండు వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలు గందరగోళంగా మారాయి. పార్టీ అధిష్టానం సిసలైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది. ఓటింగ్ విధానంలోనే నాయకత్వాన్ని ఎంపిక చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. లేదంటే తామే గ్రామ స్థాయి కమిటీల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరిస్తోంది పార్టీలోని ఒకవర్గం. ఇలాంటి వాతావరణంలో ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందట. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసి, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. కష్టమో, నిష్టూరమో….రిస్క్‌ తీసుకునైనా…. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని గాడిన పెడతారా? లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను...

Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, CNG SUVs భారతీయులకు...

Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మీరా భయందర్ ప్రాంతంలోని మురికివాడల్లో పెద్ద...