29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?

Date:

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, ఫేక్ అకౌంట్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫేక్ అకౌంట్లు ఈ చర్చలకు మరింత తావిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు, కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా జూన్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

PM Modi: టార్గెట్ పాకిస్తాన్.. మోడీ నివాసంలో రక్షణ మంత్రి, అజిత్ దోవల్ అత్యున్నత భేటీ..
అయితే, ఇతర హీరోల ఫ్యాన్స్‌గా చెప్పబడుతున్న కొన్ని అకౌంట్ల నుంచి ఇప్పుడు రెచ్చగొట్టే ట్వీట్లు ఎక్కువవుతున్నాయి. ముందుగా, నాగచైతన్య ఫ్యాన్ అకౌంట్‌గా చెప్పబడుతున్న ఒక అకౌంట్ నుంచి, “మేము కూడా జూన్ 25వ తేదీన వస్తున్నాం, దమ్ముంటే అదే రోజు వెనక్కి తగ్గకుండా రమ్మని” సవాలు చేస్తూ ట్వీట్ వచ్చింది. దీనిని ఆధారంగా తీసుకుని మరికొందరు కూడా ట్వీట్లు వేస్తున్నారు. అలాగే, నాని ఫ్యాన్ అకౌంట్‌గా చెప్పబడుతున్న మరో అకౌంట్ నుంచి, “మా నాని ‘పారడైజ్’ సినిమా చూసి భయపడ్డావా? అందుకే క్లాష్ నుంచి తప్పుకున్నావా?” అంటూ మరో ట్వీట్ వేశారు.
NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్
నిజానికి, నాగచైతన్య సినిమా గానీ, ‘పారడైజ్’ సినిమా గానీ ఇప్పటివరకు విడుదల తేదీని ప్రకటించలేదు. ఎన్టీఆర్-నీల్ సినిమా మాత్రమే సంక్రాంతికి రావాల్సి ఉండగా, అది వాయిదా పడి జూన్ 25వ తేదీన విడుదల అవుతోంది. ఇప్పటివరకు ఈ తేదీకి ఎలాంటి సినిమా విడుదల ప్రకటనలు లేవు. అయినప్పటికీ, అటెన్షన్ కోసమో, గొడవలు సృష్టించాలనో తెలియదు, కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ అకౌంట్ల నుంచి రెచ్చగొట్టే మరియు అసభ్యకరమైన ట్వీట్లు వస్తున్నాయి. దీర్ఘకాలంలో, ఇది ఆయా హీరోలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం మాత్రమే అవుతుంది, మరొకటి కాదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

నియోజకవర్గాల పునర్విభజనతోపాటు దేశంలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి....

KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

KKR vs MI : ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో...

Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు...

Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు

హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్కాపూర్...