16
June, 2026

A News 365Times Venture

16
Tuesday
June, 2026

A News 365Times Venture

NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Date:

భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల తన బౌలింగ్, రనప్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అయినప్పటికీ, బౌలింగ్ విభాగంలో తాను ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందని ఈ యువ ఆటగాడు భావిస్తున్నారు. ధర్మశాలలో వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా అఫ్గాన్ ప్రమాదకర ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఒక అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ కోచ్ స్టీఫెన్ జోన్స్‌తో కలిసి నితీష్ పనిచేశారు. ఈ శిక్షణ వల్ల ఆయన బౌలింగ్ వేగం, ఖచ్చితత్వం పెరిగాయి.

భారత అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతుండటంతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ కోసం నితీష్ రెడ్డిని మేనేజ్‌మెంట్ సిద్ధం చేస్తోంది. నితీష్ బ్యాటింగ్ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు, అయితే ఇప్పుడు ఆయన బౌలింగ్‌లోనూ రాణిస్తుండటం జట్టుకు సానుకూలాంశం. యార్కర్ల వాడకంపై స్పందిస్తూ, తాను యార్కర్‌ను రక్షణ కోసమే కాకుండా వికెట్లు తీసే అస్త్రంగా కూడా వాడుతానని నితీష్ చెప్పారు. ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల పూర్తి ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినా, ఎప్పుడు అవకాశం వచ్చినా సిద్ధంగా ఉండేలా నెట్స్‌లో కఠినంగా శ్రమించానని తెలిపారు. కెప్టెన్ నమ్మకంతో బంతిని చేతికి ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉండకూడదనేదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

తన బౌలింగ్ ఫ్రంట్-ఆన్ యాక్షన్, రనప్ వేగాన్ని పెంచడం కోసం యాక్షన్‌లో కొన్ని మార్పులు చేసుకున్నానని, ఇది ఇప్పుడు ఆశించిన ఫలితాలను ఇస్తోందని వివరించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం రాణించాలంటే నిరంతరం రాటుదేలాలని, రాబోయే రోజుల్లో తన బౌలింగ్‌ను మరింత పదును పెట్టుకుంటానని నితీష్ కుమార్ రెడ్డి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!

Janasena Joining Committee: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన సంస్థాగత...

Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..

Secunderabad Bonalu 2026: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్...

Meta AI: మెటాలో అంతర్గత తిరుగుబాటు.. ‘దారుణమైన తప్పులు చేశాం’ అంటూ దిగొచ్చిన యాజమాన్యం!

Meta AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం!...

Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్‌లపై భారీ డిస్కౌంట్.!

Hero Bikes Offers: భారతదేశంలో పర్యావరణహిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా...