ఈ మధ్యకాలంలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నిస్సాన్ కారుపై ఓ లుక్కేయండి. ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ తన నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 65 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. నిస్సాన్ తన పాపులర్ కాంపాక్ట్ SUV, నిస్సాన్ మాగ్నైట్‌ను అక్టోబర్ 2024లో కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. మాగ్నైట్ డెలివరీ ప్రారంభం కాకముందే, దాని బుకింగ్ సంఖ్య 10,000 యూనిట్లను దాటింది. సేల్ ను మరింత పెంచుకునేందుకు కంపెనీ దానిపై బంపర్ డిస్కౌంట్ ఇస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ మూడు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read:RCB vs GT: హాఫ్ సెంచరీతో ఆదుకున్న లివింగ్ స్టోన్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
నిస్సాన్ మాగ్నైట్ పై డిస్కౌంట్ ఆఫర్లు
నిస్సాన్ మాగ్నైట్‌పై రూ. 55,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ అందిస్తోంది. కార్నివాల్ బెనిఫిట్స్ రూపంలో రూ. 10,000 వరకు అదనపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద, నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలుపై కస్టమర్‌కు బంగారు నాణెం అందిస్తోంది. అయితే, నిస్సాన్ మాగ్నైట్ పై కార్నివాల్ ప్రయోజనాలు ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
Also Read:Earthquake: జపాన్‌లో భూకంపం.. 6.2గా తీవ్రత నమోదు
కొత్త నిస్సాన్ మాగ్నైట్‌కు న్యూ ఫేస్, క్రోమ్ ఇన్సర్ట్‌లు అందించారు. దీనికి కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టెయిల్ లాంప్స్ ఉన్నాయి. దీనికి 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, డ్రైవర్ సీటు కోసం హైట్ అడ్జస్ట్ మెంట్, పవర్డ్ మిర్రర్లు, HEPA ఎయిర్ ఫిల్టర్, LED హెడ్‌లైట్లు, LED DRLలు వంటి ప్రీమియం ఫీచర్లు అందించారు. ఇది I-Key ఫీచర్ ను కలిగి ఉంది. దీని సహాయంతో 60 మీటర్ల దూరం నుంచి కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేయొచ్చు.
దీనితో పాటు ఆటో LED ల్యాంప్స్, ఆటో డిమ్ ఫ్రేమ్‌లెస్ IVRM, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 336-540 లీటర్ల బూట్ స్పేస్, 19+ యుటిలిటీ స్టోరేజ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం.. ఇందులో VDC, ESC, TPMS, EBSతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, రెయిన్‌ఫోర్డ్ బాడీ స్ట్రక్చర్, డోర్ ప్రెజర్ సెన్సార్, గ్రావిటేషనల్ సెన్సార్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ISO FIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ESS (ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్) వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందించారు.