24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..

Date:

Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కొనసాగించవద్దని చెప్పినందుకు నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి బలయ్యాడు. సహజీవనం చేస్తున్న మహిళతోపాటు.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు. నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించిన సైదాపురం హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ధ్రువీకరించారు. సైదాపురం మండలం ఆదురుపల్లి గ్రామ సమీపంలో ఉన్న నిమ్మ తోటలో ముగ్గురు గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటూ నిమ్మ తోటకు కాపలా ఉండేవారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంతో లక్ష్మమ్మ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె అక్కడే నివాసం ఉంటున్న మస్తానయ్యతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఆమెతో గొడవ పడేవాడు.

READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్‌ స్టాల్స్‌కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!

మస్తానయ్యతో సంబంధాన్ని కొనసాగించొద్దంటూ పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో మస్తానయ్యతో కూడా గొడవ పడడంతో.. అతను సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. కర్రతో తల పైన బలంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మ కలిసి ఈ హత్య చేశారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక నిమ్మ తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసులు జోక్యం చేసుకుని మృతదేహానికి కాళ్లు చేతులు కట్టి.. గోనె సంచిలో పెట్టారు. ఆ గోనె సంచికి పెద్ద బండరాయి కట్టి సమీపంలో ఉండే చెరువులో పడేశారు.

దాదాపు వారం పాటు మృతదేహం చెరువులోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం చెల్లి మౌనికకు అనుమానం వచ్చి తన అన్న కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో చెరువులో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలో దిగిన పోలీసులు కేసుని ఛేదించారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మతో పాటు.. మృతదేహాన్ని బయటపడేసేందుకు సహకరించిన శ్రీనివాసులుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మొత్తంగా వివాహేతర బంధం.. ఆ తర్వాత జరిగిన గొడవల ద్వారా సుబ్రహ్మణ్యం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.

READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mallikarjun Kharge: కామన్వెల్త్ క్రీడల్లో గడ్కరీ ఏం చేశారో తెలియదా? బీజేపీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన కేసులో జాతీయ కాంగ్రెస్ యూత్...

El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!

మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది....

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!

Adulterated Milk: రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి...

Off The Record : ఆదాలతో మాజీ మంత్రి కాకాణి భేటీపై ఆసక్తి…

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు పెద్దారెడ్లంటే ఒక డిఫరెంట్‌...