30
July, 2025

A News 365Times Venture

30
Wednesday
July, 2025

A News 365Times Venture

Nellore Chepala Pulusu: ఇంట్లోనే అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు చేసుకుందాం రండి..

Date:

చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, వీటిని శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తినడం ఆరోగ్యానికి చాలా రకారకాల పోషకాలు అందుతాయి. చేపలు మంచి ప్రొటీన్‌ ఆహారం. అయితే చేపల పులుసులో నెల్లూరి చేపల పులుసుకు ఓ ప్రత్యేకత ఉంది. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ నెల్లూరి చేపల పులుసుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, పదార్థాలు, కుకింగ్​ ప్రాసెస్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

READ MORE: Pawan Kalyan: రోహింగ్యాలు, స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టండి!

తయారీకి కావాల్సినవి..
చేపలు- 1 కేజీ,
చింతపండు – 50 గ్రాములు
ఉల్లిపాయలు- 2 (సన్నగా కట్ చేసి పెట్టుకోండి)
పచ్చిమిర్చి- 4
పుల్లమామిడికాయ- 1
ధనియాలు- 2 టీస్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్
నూనె- 4 టేబుల్ స్పూన్లు
కొద్దిగా కరివేపాకు
కొద్దిగా కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్టు- 1 టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
కారం- 4 టీస్పూన్లు
ఉప్పు- సరిపడా
నిమ్మకాయ- 1
టమాట- 1
మెంతులు- అర టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్

READ MORE: Manoj: ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు.. సమయం దొరికితే వంట!

నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం:
ఫస్ట్ చేపల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. కావాల్సిన సైజ్‌లో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవడం మంచిది. ముక్కలను మరోసారి ఉప్పు, నిమ్మకాయతో బాగా కడగాలి. చేప ముక్కలపై 2 టీస్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి.. బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొన్న ముక్కలను ఓ 30 నిమిషాలు పక్కన పెట్టండి. 50 గ్రాముల చింతపండు తీసుకొని.. శుభ్రంగా కడిగి.. కొద్దిసేపు నానబెట్టాలి. గుజ్జు పక్కకు తీసి ఆ వాటర్‌ని వేరు చేయాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. ఓ పుల్ల మామిడి కాయ తొక్కు తీసి.. చిన్న ముక్కలుగా కోయాలి. అలాగే టమాటాను కూడా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ లేకపోతే.. దాని బదులు మరో టమాటను కట్​ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. చిన్న కడాయి పెట్టి.. మెంతులు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, ధనియాలు 2 టీస్పూన్లు, ఆవాలు పావు టీస్పూన్ వేసి చిన్న మంటపై దోరగా వేయించి.. అనంతరం ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.

READ MORE: Manoj: ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు.. సమయం దొరికితే వంట!

అవి కొద్దిగా చల్లారాక… రోలు లేదా మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి. తర్వాత కొంచెం పెద్ద గిన్నె లేదా కడాయి స్టవ్​ మీద పెట్టి.. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యండి. నూనె వేడెక్కాక… మెంతులు పావు టీస్పూన్, ఆవాలు పావు టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కాస్తా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీస్పూన్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు దోరగా వేయించాలి. అనంతరం మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వేసి.. ఫ్రై చేయాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక… పసుపు పావు టీస్పూన్, కారం 2 టీస్పూన్లు, ఉప్పు సరిపడా వెయ్యాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలకు ఉప్పు వేశాం. కాబట్టి… దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పడు సరిపడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే సిద్ధం చేసిన మసాల పొడిని ఇప్పుడు వేసి.. నిమిషం పాటూ ఫ్రై చెయ్యాలి. ఆ తర్వాత… చింతపుండు గుజ్జును వేసుకుని కావాల్సినంత నీరు పోసుకోవాలి. 3 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు నురగ వచ్చిన తర్వాత.. చేప ముక్కల్ని వన్ బై వన్ నిదానంగా వేయాలి. 10 నిమిషాలు ఉడికించాలి. చేప ముక్కల రంగు మారుతూ ఉంటే… ఉడికినట్లే అని అర్థం. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి… స్టప్ ఆపేయండి. నోరూరించే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయినట్టే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్: స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్...

Rahul Gandhi: పాకిస్తాన్‌లో “రాహుల్ గాంధీ” ట్రెండింగ్.. కారణాలు ఏంటి..?

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...

CS Ramakrishna Rao: ఐఏఎస్‌ శరత్ వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహం.. చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరిక!

సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేటలో...