18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!

Date:

Naturally Lizard Removal Tips: వేసవి, వర్షాకాలాల్లో ఇంట్లో బల్లుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. గోడలపై పాకుతూ కనిపించే బల్లులను చూసి కొందరు భయపడుతుంటే, మరికొందరికి అవి ఇంటిని అపరిశుభ్రంగా మారుస్తున్నాయనే భావన కలుగుతుంది. బల్లులను తరిమికొట్టేందుకు చాలామంది నెమలి ఈకలు, గుడ్డు పెంకులు వంటి ఎన్నో చిట్కాలు ప్రయత్నిస్తారు. కానీ అవి ఎక్కువసార్లు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని కూడా చెబుతుంటారు.. ఇక, వేసవి సమయంలో అయితే.. గోడలను వదిలి.. ఇంట్లో చల్లగా ఉండే ప్లేస్‌లు, చివరకు సింక్‌ల్లో చేరి కూడా ఇబ్బంది పెడుతుంటాయి.. అలాంటి పరిస్థితుల్లో ఒక సులభమైన ఇంటి చిట్కా.. కేవలం మూడు పదార్థాలతో తయారయ్యే ఈ ప్రత్యేక స్ప్రే బల్లులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు..

బల్లులను తరిమికొట్టే స్ప్రేకు కావలసిన పదార్థాలు
* 3 నాఫ్తలీన్ బంతులు
* 2 టీస్పూన్ల డెటాల్
* అర కప్పు నీరు

స్ప్రే తయారీ విధానం:
ముందుగా నాఫ్తలీన్ బంతులను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో డెటాల్ మరియు అర కప్పు నీరు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ ద్రావణాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.

ఇంట్లో ఎక్కడ స్ప్రే చేయాలి?
బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ స్ప్రే చేయాలి.. గది మూలల్లో.. కిటికీల చుట్టూ.. వంటగదిలోని చీకటి ప్రాంతాల్లో.. సింక్‌లు, క్యాబినెట్‌ల వెనుక భాగాల్లో ఇలా బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే బల్లులు ఆ ప్రాంతాలకు రావడం తగ్గుతుంది..

ఈ చిట్కా ఎందుకు పనిచేస్తుంది?
నాఫ్తలీన్ మరియు డెటాల్‌కు ఉండే ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. అందుకే ఆ వాసన ఉన్న ప్రదేశాలకు అవి దూరంగా ఉంటాయి. మార్కెట్‌లో దొరికే రసాయన స్ప్రేలతో పోలిస్తే ఈ ఇంటి చిట్కా సులభంగా తయారవుతుంది. అలాగే తక్కువ ఖర్చుతోనే ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ద్రావణాన్ని ఉపయోగించే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే వారి చేతికి అందకుండా ఉంచాలి. అలాగే స్ప్రే చేసే సమయంలో చేతి తొడుగులు, మాస్క్ ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..

V.D. Satheesan: కేరళంలో దశాబ్దం కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* IPL 2026: ఇవాళ CSK వర్సెస్‌ SRH.. చెన్నై వేదికగా...

Epstein: ఎప్‌స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..

దివంగత అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌పై ఫ్రాన్స్‌లో...

Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..

Actor Vishal: నటుడు విశాల్, సీఎం విజయ్‌ను ప్రశ్నించడం తమిళనాడులో సంచలనంగా...