Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని గాంధీనగర్ దేవి చౌక్ ప్రాంతంలో వదిలివేయడానికి ఈనెల నాలుగో తేదీన వచ్చి బోయగూడా లో తెలిసిన వారి ఇంటికెళ్లి దారుణ హత్యకు గురై సంపులో శవం అయి తేలాడు.
అల్వాల్ పిఎస్ పరిధి నుంచి సమాచారం అందుకున్న ముషీరాబాద్ పోలీసులు స్వప్నం సింగ్ అదృష్టమైనట్లు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.. ఐదవ తేదీ అర్ధరాత్రి గాంధీనగర్ పిఎస్ పరిధిలోని బోయగూడలో ఓ సంపులో స్వప్నం సింగ్ దారుణ హత్యకు గురై శవమై కనిపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గాంధీనగర్ పిఎస్ పరిధిలోని బోయగూడా ఆల్ ఫా త్త హోటల్ వీధిలో జరిగిన సంఘటన. చనిపోయిన స్వప్నం సింగ్ వృత్తిరీత్యా ఫైనాన్సర్. స్వప్నం సింగ్ ను తెలిసినవారే కుట్రపన్నీ హత్య చేశారా అనే కోణంలో ఆయనకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి.. ఆయనను ఎవరు చంపి ఉంటారు అనే విషయంలో ముషీరాబాద్ గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు
స్వప్నం సింగ్ దారుణ హత్య ఘటనపై ముషీరాబాద్ గాంధీనగర్ పోలీసులు వివిధ ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు. స్వప్నం సింగ్ ఫైనాన్స్ ఇస్తాడని కలెక్షన్ లో భాగంగా వెళ్ళినందుకే ఫైనాన్స్ తీసుకున్నవారు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..