15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Movies In March 2025: మార్చి నెలలో థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఇదిగో!

Date:

Movies In March 2025: మార్చి నెలలో వేసవి హంగులతో థియేటర్లు సందడి కానున్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటు.. మరికొన్ని చైనా సినిమాలు.. అనేక అనువాద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి, ఈ మార్చిలో విడుదల కానున్న చిత్రాలు ఏవో ఓసారి చూద్దాం పదండి.

Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల

* హిందీలో విజయవంతమైన ‘ఛావా’ (Chhaava) సినిమా తెలుగులోకి అనువాదమవుతోంది. శంభాజీ మహారాజ్ వీరగాథగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది.

* మహిళల సాధికారతకు అద్దం పట్టే ‘నారి’ (Naari: The Women) సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఆమని, వికాస్ వశిష్ఠ, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూర్య వంటిపల్లి తెరకెక్కించారు.

* మార్చి 7న మరో సినిమా ‘జిగేల్’ (Jigel) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి మల్లి దర్శకుడు.

* పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కథాంశంతో తెరకెక్కిన ‘కోర్ట్’ (Court) సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించగా.. ప్రియదర్శి, హర్ష్ రోషన్ కీలక పాత్రలు పోషించారు.

* హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba) కూడా మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకుడు.

* ఇక మార్చి 28న ఏపీ డిప్యూటీ సీఎం నటించిన పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పార్ట్ 1 విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదన్న చర్చ సినీ వర్గాల్లో ఉంది.

* నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robinhood) మూవీతో ప్రేక్షకుల ముందుకు మార్చి 28న రాబోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ కు నితిన్‌ వీర అభిమాని. ఈ ఇద్దరి చిత్రాలు ఒకేరోజు బాక్సాఫీసు ముందుకురానుండడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. కాకపోతే, ‘హరిహర వీరమల్లు’ ఆ సమయానికి విడుదల కాకపోవచ్చని టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది.

Read Also: Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..

* సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) సినిమా మార్చి 29న విడుదల కానుంది.

* వీటితోపాటు అనువాద సినిమాలలో ‘కింగ్‌స్టన్’ (Kingston), ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on Duty) మార్చి 7న విడుదల అవుతుండగా.. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్ 2’ (Veera Dheera Sooran 2), మోహన్‌లాల్ ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan) మార్చి 27న రానున్నాయి.

* మరోవైపు బాలీవుడ్ లోకూడా ఈ నెల బిగ్ మూవీస్ విడుదలకానున్నాయి. ‘ది డిప్లొమాట్’ (The Diplomat) మార్చి 14, ‘సికందర్’ (Sikandar) – ఈద్ స్పెషల్ గా విడుదల కానుంది.
మార్చిలో విడుదలకు సిద్ధమైన సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు వస్తున్నాయి. కానీ కొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..

LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని...

BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్‌కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?

BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ,...

Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైలురాయిగా నిలిచిన...

OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

థియేట్రికల్ మూవీస్ ఇంట్రస్టింగ్‌గా లేవు.. ఓటీటీ సినిమాలతో సరిపెట్టుకుందాం అనుకునే వారికి...