11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

Monalisa: తన ఫస్ట్‌ మూవీ రెమ్యునరేషన్‌తో స్కూల్‌ పెడుతోన్న మోనాలిసా..

Date:

Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా.. ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. సాధారణ జీవితంతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు వెండితెర వరకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాకుంభ్‌లో వైరల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలతో మోనాలిసా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల తన మొదటి హిందీ సినిమా “ది డైరీ ఆఫ్ మణిపూర్” ప్రారంభోత్సవానికి హాజరైన మోనాలిసా భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచం, తన పాత జీవితం రెండింటినీ సమానంగా ప్రేమిస్తున్నానని ఆమె వెల్లడించింది.

ఇక, తాజాగా ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి వచ్చిన మోనాలిసా, గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపింది. మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని ఆమె చెప్పింది. తన జీవితాన్ని మార్చిన ఈ అవకాశాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మోనాలిసా వెల్లడించింది. తన ఫస్ట్ మూవీ నుంచి వచ్చే రెమ్యునరేషన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలన్నదే తన కల అని ఆమె తెలిపింది. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువుకోని బాలికలు జీవితంలో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని మోనాలిసా నమ్మకం. అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా, భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు మోనాలిసా.. కాగా, ప్రస్తుతం మోనాలిసా మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా, ఒకటి హిందీ సినిమా “ది డైరీ ఆఫ్ మణిపూర్”. సాధారణ అమ్మాయి నుంచి సినీ నటి వరకు వచ్చిన ఆమె ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తిగా మారింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. తాను ఎక్కడ నుంచి వచ్చాను అనే విషయాన్ని మర్చిపోకుండా.. ఆ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని చూస్తుంది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న...