MLC Kavitha : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర నివాసాన్ని కవిత సందర్శించగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం.. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జెసీ కృష్ణను పరామర్శించారు కవిత.
ఖమ్మంలో గాయత్రి రవి నివాసంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడుమంది మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. “అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం, సిస్టర్ పొంగులేటి సీతక్కదె నిన్న ములుగు పర్యటనలో ఉన్నా, వైద్యం అందక చనిపోయిన శిశువు విషయంలో స్పందించలేదు” అని ఆరోపించారు.
ఖమ్మం జిల్లా విప్లవాలకు నిలయమైనా, ప్రస్తుతం కమ్యూనిస్టులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే కమ్యూనిస్టులు, ఇప్పుడు ప్రభుత్వ భాగస్వాములుగా ఉండటంతో ప్రశ్నించడంలేదు అని కవిత వ్యాఖ్యానించారు.
“జపాన్ మనకంటే పెద్ద దేశమే కావచ్చు కానీ… అక్కడ ఇంటర్నెట్ లేదనుకునేంత స్థితిలో సీఎం ఉన్నారని అర్థమవుతోంది. రైతులు నష్టపోయినా, రాష్ట్రంలో అవ్యవస్థలు ఏర్పడినా ఆయన స్పందించడంలేదు” అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీటిని అందించామని గుర్తు చేశారు. “ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేకపోయింది” అని విమర్శించారు. అంతేకాకుండా, రైతులకు రుణ మాఫీ, కూలీలకు ఆత్మీయ భరోసా వంటి వాగ్దానాలు కూడా నిలబడలేదని పేర్కొన్నారు. వచ్చే 27వ తేదీన వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు..