Minister Nimmala: శ్రీకాకుళం కలెక్టరేట్ లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష నిర్వహించారు. కాగా, వంశధార ఎడమ కాలువ, మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. 2019-24 వైసీపీ ప్రభుత్వంలో 32 వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 35 వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించింది.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు అని ఆరోపించారు. మహేంద్ర తనయ ప్రాజెక్ట్ లను నిర్వీర్యం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్, రెవెన్యూ మంత్రి, పశుసంవర్ధక మంత్రి ఉన్నా, ఈ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యం అంటూ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
Read Also: JD Vance: ‘‘ ప్రధాని మోడీని చూస్తే నాకు అసూయ’’.. యూఎస్ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాజెక్టులపై మరోసారి సెక్రటేరియట్ లో రివ్యూ చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉత్తరాంధ్రకు 2025 జూన్ నాటికే గోదావరి జలాలు తరలించేలా, పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేసి, ఈ ప్రాంత ప్రజల ఋణం తీర్చుకుంటాం.. నేరడి బ్యారేజ్ పై నోట్స్ సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.