Midhun Reddy: ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష పార్టీకి హాజరైన వైసీపీ లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉగ్రవాదులపై చర్యలపై మాట్లాడారు. ఉగ్రవాదుల అణిచివేతకు తీసుకునే అన్ని చర్యలకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని, కాశ్మీర్ లో అశాంతి నెలకొల్పే శక్తులను అణిచివేయాలని ఆయన అన్నారు. సరైన సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు.
కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితులు ఉన్న సమయంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర చేశారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడేలా చర్యలు ఉండాలని ఆయన కోరారు. మనదేశంలో హిందూ, ముస్లిం విభజన తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని.. పర్యాటకలను కాపాడే క్రమంలో ఓ ముస్లిం ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భారతీయ ముస్లింలు వేరు… పాకిస్తాన్ ముస్లింలు వేరని ఆయన పేర్కొన్నారు.