21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

Miami Open 2025: టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. అదనపు భద్రత కేటాయింపు!

Date:

మాజీ ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌కు కోర్టు, బయట సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. రోలాండ్ గారోస్‌లో అద్భుత విజయం తర్వాత.. నిషేధిత పదార్థం తీసుకోవడంతో ఓ నెల సస్పెన్షన్ కారణంగా ప్రత్యర్థి అరినా సబలెంకాకు అగ్రస్థానాన్ని కోల్పోయింది. అప్పుడు స్వైటెక్‌ కెరీర్ ప్రమాదంలో పడింది. స్వైటెక్‌ తన స్థానాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్న సమయంలో మయామి ఓపెన్‌లో ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది.

మయామి ఓపెన్‌ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో ఓ ప్రేక్షకుడు ఇగా స్వైటెక్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమె కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దాంతో మియామి ఓపెన్‌లో ఆమెకు అధికారులు అదనపు భద్రత కేటాయించారు. సదరు ప్రేక్షకుడు డ్జోనీ బ్రావోగా గుర్తించారు. విషయాన్ని టోర్నమెంట్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లామని, వెంటనే స్వైటెక్‌కు భద్రతను పెంచారని ఆమె ప్రతినిధి పేర్కొన్నారు. క్రీడాకారిణుల భద్రత అత్యంత ప్రాధాన్యమైన విషయం అని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని టోర్నమెంట్‌ నిర్వాహకులను మహిళల టెన్నిస్‌ అసోషియేషన్‌ ఆదేశించింది.

Also Read: Sunil Gavaskar: ఆ డబ్బును గౌతమ్ గంభీర్‌ వెనక్కి ఇచ్చేస్తాడా?

ఈ సమయంలో కూడా ఇగా స్వైటెక్‌ మంచి ఆటను ప్రదర్శించింది. మయామి ఓపెన్‌లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్‌పై 7-6(2), 6-1 తేడాతో విజయం సాధించి నాల్గవ రౌండ్‌కు చేరుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్ సందర్భంగా బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంది. ఇది ఆమె ప్రదర్శనపై ప్రభావితం చూపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టులో మరోసారి భారీ స్థాయిలో రేషన్ బియ్యం...

Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట

దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక...

SSB Constable Recruitment 2026: సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ పోస్టులు.. 10th, ఇంటర్ పాసైతే మిస్ చేసుకోకండి

సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్...

Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026కు ముందు,...