ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ మాఫియా డాన్ నెమెసియో రుబ్న్ ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెన్చో (60) భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. ఆదివారం ఎల్ మెన్చో చనిపోయినట్లుగా మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎల్ మెన్చో అలా హతమయ్యాడో లేదో మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి రణరంగం సృష్టించారు. రహదారులపై వాహనాలను తగలబెట్టారు. ఆస్తులు ధ్వంసంతో పాటు నిప్పుపెట్టారు. పెట్రోల్ బంకులకు నిప్పుపెట్టారు. దీంతో ప్రస్తుతం మెక్సికోలోని నగరాలు పొగలు, మంటలతో ఎగిసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

20 రాష్ట్రాల్లో 250కు పైగా వాహనాలు తగలబెట్టినట్లుగా మెక్సికన్ భద్రతా అధికారులు వెల్లడించారు. రోడ్లుబ్లాక్ చేసి.. రవాణా కారిడార్లను స్తంభింజేసి.. ఇళ్లల్లోంచి ప్రజలను బయటకు రాకుండా బీభత్సం సృష్టించారు. ప్రస్తుతం ఒక విమానాశ్రయం దగ్గర కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎల్ మెన్చోకు మద్దతుదారులైన వారంతా ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. హత్యకు ప్రతీకార చర్యగా దారుణాలకు ఒడిగట్టినట్లుగా చెప్పారు. ఇక ఎయిర్ కెనడా, యునైటెడ్, ఏరోమెక్సికో, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు విమాన సర్వీసులను నిలిపివేశాయి.
ప్రస్తుతం పరిస్థితులు బాగోలేనందున ప్రజలు ఎవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని జాలిస్కో గవర్నర్ పాబ్లో లెమస్ కోరారు. ప్రజా రవాణాను నిలిపివేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తోందని హెచ్చరించారు.
భారతీయులకు అలర్ట్..
మెక్సికోలో అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా మెక్సికోలో భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇళ్లల్లోనే ఉండాలనిని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, స్థానిక అధికారుల అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. సాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
Híjole. Con estas mañanas de domingo no va a alcanzar con traer a #Shakira, el México vs. Portugal, es más, ni siquiera el Mundial, para tapar la ingobernabilidad.
Jalisco un infierno y todo el país ¿Y la presidenta? ¿Y Morena? Ya me acordé que protegen narcos #narcobloqueos pic.twitter.com/LoJ3BYM28u
— Ricardo Salinas Pliego (@RicardSalinasP) February 22, 2026
Dear all Indian nationals in Mexico:
There are ongoing security operations and related road blockages and criminal activity, Indian nationals in Jalisco State (areas of Puerto Vallarta, Chapala, and Guadalajara), Tamaulipas State (areas of Reynosa and other municipalities),…
— India in México (@IndEmbMexico) February 22, 2026
BREAKING: Passengers and airport staff were seen fleeing amid reports of gunfire inside Guadalajara International Airport as members of the CJNG cartel allegedly attempted to storm the airport and other nearby locations in the state of Jalisco.
— Breaking911 (@Breaking911) February 22, 2026
JUST IN:
Vehicles and businesses set on fire in major Mexican tourist destinations Cancún, Playa del Carmen, Tulum, and Cozumel after CJNG cartel leader El Mencho was killed. pic.twitter.com/Lvjpr0MTyU
— BRICS News (@BRICSinfo) February 22, 2026
Pray for Mexico pic.twitter.com/aIlvfONluW
— Jeddy0xETH (@Jeddy0xETH_) February 23, 2026
CARTELS CONTINUE TO WREAK HAVOC IN MEXICO AS GAS STATION IS SET ABLAZE pic.twitter.com/pOah7NPK1g
— Real America's Voice (RAV) (@RealAmVoice) February 22, 2026
Chaos erupts at Guadalajara International Airport in Jalisco, Mexico, as the CJNG Cartel launches attacks outside and potentially inside the airport, as retaliation for today’s successful elimination of CJNG leader El Mencho. pic.twitter.com/fspjMASWV1
— OSINTdefender (@sentdefender) February 22, 2026
Narcos are digging up parts of a highway in Mexico, like actually tearing into the road.
Instead of only burning cars and blocking lanes, they’re literally turning roads permanently useless.
pic.twitter.com/kbXYxB6JiE
— World Monitor (@MonitorWarnow) February 23, 2026



BREAKING: Passengers and airport staff were seen fleeing amid reports of gunfire inside Guadalajara International Airport as members of the CJNG cartel allegedly attempted to storm the airport and other nearby locations in the state of Jalisco.
Vehicles and businesses set on fire in major Mexican tourist destinations Cancún, Playa del Carmen, Tulum, and Cozumel after CJNG cartel leader El Mencho was killed. 
