1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

Date:

నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. చిన్నారి డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో అసలేం జరిగింది? చిన్నారిని ఎవరు చంపేశారు?

Also Read:Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..

నారాయణపేట జిల్లా బసిరెడ్డిపల్లికి చెందిన అంజి, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారి వెంట బాబును తీసుకెళ్లారు. ఐతే కూతుర్ని మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర ఉంచేశారు. దాంతో అవ్వా తాత.. చిన్నారి తేజశ్రీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరోవైపు చిన్నారి తేజశ్రీ కూడా అవ్వా, తాత దగ్గర బాగానే పెరుగుతోంది. రోజూ అంగన్‌వాడీకి వెళ్లడం.. తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది.

అంతా బాగుంది అనుకున్న తరుణంలో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట నిద్రించడం ఆనవాయితీ. రాత్రి అవ్వ తాతతో కలిసి తేజశ్రీ బయట నిద్రించింది. కానీ అర్ధరాత్రి సమయంలో అమ్మాయి వారి పక్కలో లేకపోవడంతో వృద్ధ దంపతులు కంగారు పడ్డారు. గ్రామస్థుల సహాయంతో గ్రామంలో వెతుకగా చెరువు కట్టపై చిన్నారి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన గ్రామస్తులు హుటాహుటిన నారాయణపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసు జాగిలాలతో సంఘటన స్థలాన్ని పరీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

ఐదేళ్ల చిన్నారి తేజశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ చిన్నారిని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా? లేదా దొంగతనానికి వచ్చి.. అమ్మాయి పైనున్న వెండి పట్టీల కోసం దుండగులు ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని వాటిపై దర్యాప్తు చేస్తున్నామని నారాయణపేట DSP లింగయ్య తెలిపారు.

Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తేజశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంత చిన్న గ్రామంలో తేజ శ్రీని ఎవరు.. ఎందుకు చంపారనే దానిపై మిస్టరీ వీడడం లేదు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించే ఆధారాలే కీలకంగా మారాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

సైబర్ నేరగాళ్లకు కొంత మంది కంత్రీగాళ్లు.. మ్యూల్ ఖాతాలు సమకూర్చుతున్నారు. వాటి...

Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా… తస్మాత్‌ జాగ్రత్త!! చికెన్‌… మటన్‌…...

HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

HYD AIRPORT GANJAI: సినిమాటిక్‌ తరహాలో హైడ్రోఫోనిక్‌ గంజాయి తరలిస్తున్న యువకులను...

Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్,...