25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

Maruthi : మారుతికి హీరో కావలెను!

Date:

దర్శకుడు మారుతి ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘రాజా సాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూడటంతో, మారుతిపై గతంలో ఏ దర్శకుడు ఎదుర్కోనంత స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ సహా విమర్శలు వచ్చాయి. అయితే, ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, మళ్ళీ తన బలమైన ‘కామెడీ’ జోనర్‌తోనే బాక్సాఫీస్ వద్ద ప్రతీకారం తీర్చుకోవాలని మారుతి గట్టిగా నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, మారుతి ఇప్పటికే తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ పనులను ప్రారంభించారు. ఈ చిత్రానికి ‘హ్యాపీ పొంగల్’ (Happy Pongal) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్.

Also Read : Zombie Reddy 2: వైల్డ్, బిగ్గర్, డెడ్లీ.. ఈసారి జాంబీలతో వేట మామూలుగా ఉండదు!

మారుతి గత చిత్రం ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే విడుదలై నిరాశపరిచినప్పటికీ, ఈసారి తనదైన శైలిలో మార్క్ ఎంటర్‌టైనర్‌తో వచ్చి సక్సెస్ కొట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి ఈ కథకు సరిపోయే హీరో కోసం వెతుకులాటలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఉన్న మొదటి ఆప్షన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే, ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. వరుణ్ తేజ్ ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ దర్శకుడు యదు వంశీతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వరుణ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. ఒకవేళ మారుతి సినిమా చేయాలంటే వరుణ్ తేజ్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి హీరోలు మరియు నిర్మాతలు వెనుకాడుతున్నారు. మారుతికి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని వినిపిస్తోంది. లేదా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Crime: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు..!

AP Crime: పేరుకు అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ, డ్యూటీ దిగిన...

Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్

త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు,...

Decathlon Electric Bike: డెకాథ్లాన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల.. 130KM రేంజ్.. ధర ఎంతంటే?

డెకాథ్లాన్ కొత్త స్టిలస్ ఇ టూరింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్‌ను యూరోపియన్...

The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న...