11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Date:

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు బావిలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని కారును బయటకు తీశారు. పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

నాసిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దిండోరి తాలూకాలోని శివాజీనగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మారుతి XL6 కారు బావిలో పడిపోవడంతో ఇండోర్ గ్రామానికి చెందిన దర్గోడే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. దిండోరిలోని శివాజీనగర్‌లో ఉన్న రాజే బాంకెట్ హాల్‌లో వాడ్జే క్లాసెస్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇండోర్ గ్రామానికి చెందిన సునీల్ దత్తాత్రేయ దర్గోడే ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో వచ్చారు. కార్యక్రమం అనంతరం దర్గోడే కుటుంబం దిండోరి నుంచి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పరిపాలన యంత్రాంగం, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, నగర పంచాయతీ అగ్నిమాపక దళం, పోలీసులు, విపత్తు నిర్వహణ నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి. బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి రెండు క్రేన్‌ల సహాయంతో కారును బయటకు తీశారు.

కారులో నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. కారు నుంచి దిగి బావిలో మునిగిపోయిన బాలిక మృతదేహం కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు సునీల్ దత్తాత్రేయ దర్గోడే (34), అతని భార్య రేష్మా సునీల్ దర్గోడే (30), కుమార్తె రాఖీ అలియాస్ గుణ్వంతి (10), మేనకోడలు సమృద్ధి రాజేష్ దర్గోడే (7) కూడా మరణించారు. దిండోరి పోలీసులు ప్రమాదంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా...

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను...

Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, CNG SUVs భారతీయులకు...