16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Mahabharatham : జక్కన్న ‘మహాభారతం’.. కొత్త అనుమానాలు?

Date:

SSMB 29 తర్వాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. మహాభారతంను ఆరు భాగాల్లో చూపించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు.అయితే ఈ లోపే లింగుస్వామి ఈసినిమాను తీస్తాననడంతో సౌత్ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది.అది మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.ఆ మాటకొస్తే మన మైథాలజీపై ఇప్పుడున్న ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. కర్ణుడు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కల్కి’ చిత్రాన్ని ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .సినిమా క్వాలిటీ పరంగా బాగుంది కానీ,ఎమోషనల్ కనెక్ట్ కాలేదు అని విమర్శలు ఎదురైనప్పటికీ, సినిమాలో కనిపించే పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

జస్ట్ పదినిమిషాల మహాభారత యుద్ధానికి అంత వెయిట్ ఇచ్చిన ఆడియన్స్ ..రాజమౌళి లాంటి దర్శకుడు ఫుల్ లెన్త్ సినిమాగా తీస్తే వచ్చే వెయిట్ మాములుగా ఉండదు.అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా ఆరు భాగాల్లో చూపించాలని అనుకున్నాడు. బహుశా మహేష్ సినిమా పూర్తి అయ్యాక ఈ ప్రాజెక్టే ఉండొచ్చు.తన విజన్ లో ఉన్న మహాభారతం ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి అంటూ రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు .: ఐతే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి 700 కోట్ల రూపాయిల బడ్జెట్ తో మహాభారతం తీసే ప్లాన్ లో ఉన్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

పందెం కోడి,ఆవారా లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు రీసెంట్ గా రామ్ పోతినేని తో ‘ది వారియర్’ సినిమా తీసి ఫెయిలయ్యాడు. అయినప్పటికీ మహాభారతం లోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని రెండు భాగాలుగా మహాభారతంలోని ఎవరు చూపించి కోణాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు.బహుశ విరాటపర్వం లో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అన్నమాట. అప్పట్లో ఈ అంశంపై ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నర్తనశాల, మాయాబజార్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాల్లోనూ.అభిమన్యుడు, ఉత్తర మధ్య జరిగే వివాహం వరకే చూపించారు. ఆ తర్వాత అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణం చెందే వరకు చూపించలేదు. లింగ స్వామి తీయబోయే సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతుందట.అలా తీస్తే ఈ ఇంపాక్ట్ రాజామౌళి సినిమా పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్రం యుద్ధం మీదనే మూడు భాగాలు తీయబోతున్నాడు. ఆయన తీసే మహాభారతం సిరీస్ లో అభిమన్యుడి పై కూడా ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుందని ఫిల్మీ క్రిటిక్స్ చెబుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది....

Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత నష్టాలకు బ్రేక్ పడ్డాయి. దేశీయ మార్కెట్‌లో...

Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

Governor Shiv Pratap Shukla: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు...

B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

B-1B Lancer: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా తన...