Maa Inti Bangaram: ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. లాస్ట్‌గా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా, శివనిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషి సినిమాలో హీరోయిన్‌గా కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి చాలా కాలానికి వస్తున్న లేటేస్ట్ మూవీ “మా ఇంటి బంగారం”. ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగలిగింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చేసింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్రలాల మూవింగ్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
READ ALSO: TVK Chief Vijay: “టీవీకే మాస్టర్ ప్లాన్”.. విజయ్ పోటీ చేసేది అక్కడే.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సమంత ఉన్న ఒక పోస్టర్‌పై ఈ ఏడాది మే 15న గ్రాండ్ గా రిలీజ్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. గతంలో రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను గమనిస్తే కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాగా అర్థం అవుతుంది. అలాగే ఇందులో మాస్ యాక్షన్ అంశాలు కూడా గట్టిగానే దట్టించినట్లు కనిపిస్తుంది. గతంలో రిలీజ్ అయిన ఈ టీజర్‌లో సమంత చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయే తెలిసిందే. ఇందులో యాంకర్ శ్రీముఖి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. టీజర్‌తోనే దుమ్ములేపిన సామ్.. ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాతో ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుందో వెండి తెరపై చూడాల్సిందే.
READ ALSO: Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. పాక్ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం..




