27
March, 2026

A News 365Times Venture

27
Friday
March, 2026

A News 365Times Venture

Longevity Tips: మీ ఆయుష్షు పెరిగే రహస్యం ఇదే..

Date:

Longevity Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.. ప్రపంచంలోని అన్ని సంపదల కంటే ఆరోగ్యంగా జీవించడమే మిన్న అని దీని ఉద్దేశ.. అయితే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం, మరియు ఒత్తిడి లేని జీవితంతో చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.. అంతే కాదు.. ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. కానీ, నేటి జీవనశైలిలో అనేక మంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘాయుష్షు కోసం సరైన ఆహారం, మంచి అలవాట్లు, ఒత్తిడి నియంత్రణతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీలకం. అయితే, ఏ ఒక్క వ్యాయామం మాత్రమే కాకుండా వివిధ రకాల శారీరక కార్యకలాపాలు చేయడం అత్యంత ప్రయోజనకరమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

తాజాగా BMJ Medicineలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఒకే రకమైన వ్యాయామం చేయడం కంటే కార్డియో, యోగా, వెయిట్ ట్రైనింగ్ వంటి విభిన్న వ్యాయామాలను కలిపి చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఈ పరిశోధనలో 30 సంవత్సరాల పాటు లక్షలాది మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు.

వివిధ రకాల వ్యాయామాలు.. ప్రయోజనాలు

కార్డియో వ్యాయామాలు: నడక, పరుగెత్తడం, సైక్లింగ్, ఈత
తేలికపాటి వ్యాయామాలు: యోగా, స్ట్రెచింగ్
వెయిట్ ట్రైనింగ్: బరువులు ఎత్తడం, కండరాలను బలోపేతం చేయడం
ఇంటి/బయటి పనులు: తోటపని, శారీరక శ్రమ అవసరమైన పనులు

ప్రతి వ్యాయామం శరీరానికి వేర్వేరు విధాలుగా ఉపయోగపడుతుంది. కార్డియో గుండె, ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వెయిట్ ట్రైనింగ్ కండరాలు, ఎముకలను దృఢంగా చేస్తుంది. యోగా శరీర సౌలభ్యాన్ని పెంచి, మనసుకు ప్రశాంతత ఇస్తుంది.

పరిశోధనలో వెలుగుచూసిన ముఖ్య విషయాలు
క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేసే వ్యక్తుల్లో మరణ ప్రమాదం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా, వివిధ రకాల వ్యాయామాలను కలిపి చేసే వారిలో మరణ ప్రమాదం సుమారు 19 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. అలాగే గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే, మితిమీరిన వ్యాయామం చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. కాబట్టి సమతుల్యమైన వ్యాయామ పద్ధతి అవసరం.

ఆరోగ్యంగా జీవించడానికి పాటించాల్సిన చిట్కాలు
* ఒకే వ్యాయామంపై ఆధారపడకండి
* రోజువారీ జీవితంలో వివిధ కార్యకలాపాలను చేర్చండి
* మీ శరీర సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయండి
* నడకతో పాటు యోగా, తేలికపాటి పరుగు, వెయిట్ ట్రైనింగ్ చేయండి

మొత్తంగా, దీర్ఘాయుష్షు కోసం కేవలం ఎక్కువగా వ్యాయామం చేయడం కాకుండా, వివిధ రకాల వ్యాయామాలను సమతుల్యంగా చేయడం అత్యంత ముఖ్యమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం అవసరం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..

కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ ద్వారా భారీ...

Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్‌‌ను కొడుతున్న ఇరాన్…

Iran Israel Conflict: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు....

Israel -Iran War: ఇజ్రాయిల్ “కిల్ లిస్ట్” నుంచి ఇరాన్ మంత్రి, స్పీకర్ పేర్లు తొలగింపు.. ఎందుకు.?

Israel -Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని...