26
February, 2026

A News 365Times Venture

26
Thursday
February, 2026

A News 365Times Venture

Liquor Scam: లిక్కర్‌ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్‌.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

Date:

Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు విజయవాడ రేపటిదాకా రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి రేపు మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు.

IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్‌.. సంజూ ఆన్ డ్యూటీ!

లిక్కర్ స్కాం కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు విజయవాడలోని కార్యాలయంలో సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత కోర్టులో హాజరు పరిచారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, రెండు చోట్లా పిటిషన్లు తిరస్కరించబడటంతో అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు.

రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ లిక్కర్ కుంభకోణంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డితో కలిసి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. మద్యం సిండికేట్‌ను ఏర్పాటు చేసి, కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల ద్వారా అక్రమంగా భారీ ఆర్థిక లాభాలు పొందినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మద్యం సిండికేట్ కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా, ఆర్థిక నియంత్రణ దారుడిగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు.

SA vs WI: మార్క్‌రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!

పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, తమకు అనుకూలంగా కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వ్యక్తిగత ఖర్చులతో పాటు ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. రేపు కోర్టులో మరోసారి హాజరు పరచనున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!

IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా...

NLG FAKE BABA ARREST: కంత్రీ మాంత్రికుడు..

NLG FAKE BABA ARREST: మంత్రాలకు చింతకాయలు రాలవు.. అనేది...

WEF President : ఎప్‌స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?

WEF President: వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓగా ఉన్న బోర్జ్...